మృదువైన చర్మం కోసం ఫేస్ ఫ్యాక్స్

సహజ మార్గాలను ఉపయోగించి చర్మాన్ని మృదువుగా మార్చవచ్చు.చర్మం యొక్క ఆకారం, పిగ్మెంటేషన్ మరియు టోన్ వంటి వాటిని కొన్ని సహజ పదార్దాలను ఉపయోగించి వృద్ది చేయవచ్చు.

మన వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్దాలను ఉపయోగించి సులభంగా చర్మాన్ని మృదువుగా చేయవచ్చు.

1.పసుపు, పాలు మరియు శనగపిండి స్క్రబ్

శనగపిండి తాన్ తొలగించటం, నల్లని చర్మ టోన్ ను తగ్గించటానికి, మొటిమలు మరియు మొటిమల మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది.పాలలో లాక్టిక్ ఆమ్లం ఉండుట వలన చర్మ సౌందర్యంలో సహాయపడుతుంది.

చర్మం టోన్ తేలిక పరచటానికి పసుపు సహాయపడుతుంది.కావలసినవి పసుపు పొడి - 1 స్పూన్ శనగపిండి - 1 స్పూన్ పాలు - 3 స్పూన్ గోరు వెచ్చని నీరు - ½ కప్పు గిన్నె/ పద్దతి ఒక గిన్నెలో పసుపు,శనగపిండి వేసి బాగా కలపాలి.

దీనిలో పాలను పోసి మృదువైన పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని ముఖం మరియు మెడ ప్రాంతంలో రాసి 10-15 నిమిషాలు అయ్యిన తర్వాత ముఖం మీద గోరువెచ్చని నీటిని జల్లి వేళ్ళ సాయంతో వృత్తాకార కదలికలతో మసాజ్ చేయాలి.ఈ ప్రక్రియను వారంలో ఒకసారి చేస్తే మంచి పలితం కనపడుతుంది.

2.బొప్పాయి, అవోకాడో మరియు దోసకాయ ఫేస్ ప్యాక్

ఈ ప్యాక్ చర్మానికి తేమ,పోషణ, మెరుపును అందించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

కావలసినవి బొప్పాయి గుజ్జు - 1 స్పూన్ అవెకాడో పండు గుజ్జు - 1 స్పూన్ తురిమిన దోసకాయ - 1 స్పూన్ తాజా మీగడ - 2 స్పూన్స్ గిన్నె పద్దతి ఒక గిన్నెలో బొప్పాయి గుజ్జు, అవెకాడో పండు గుజ్జు, తురిమిన దోసకాయ మరియు తాజా మీగడను తీసుకోని మృదువైన పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని ముఖం మరియు మెడ ప్రాంతంలో రాసి 10-15 నిమిషాలు అయ్యిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్రక్రియను వారంలో 2-3 సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

3.వాల్నట్ మరియు రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్

రోజ్ వాటర్ లో శీతలీకరణ మరియు యాంటీ- శోథ లక్షణాలు ఉండుట వలన రోజ్ వాటర్, వాల్నట్ తో కలిసి చర్మంలో మలినాలను తొలగించి ప్రకాశవంతంగా మారుస్తుంది.

Advertisement

కావలసినవి వాల్నట్ - 3 రోజ్ వాటర్ - 1 స్పూన్ నీరు - 1 కప్పు బ్లెండర్ పద్దతి ఒక కప్పు నీటిలో వాల్నట్ వేసి రాత్రంతా నానబెట్టాలి.మరుసటి రోజు నానిన వాల్నట్ ను, కొంచెం రోజ్ వాటర్ వేసి బ్లెండర్ సాయంతో మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని ముఖం మరియు మెడ మీద రాసి ఒక గంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఈ ప్రక్రియను వారానికి ఒకసారి చేస్తే మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు