మీలో ఎవరు కోటీశ్వరుడు … అప్పటికి తెలుగు తెరపై నెం1 షో.నాగార్జున ఆ షోని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారు.
ఆ షో కాస్త మెగాస్టార్ చిరంజీవి చేతిలో పడగానే, అంచనాలు ఇంకా పెరిగాయి.నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ల కంటే ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని, టీఆర్పి డబుల్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదని ఊహించుకుంది స్టార్ మా యాజమాన్యం.
కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఆ షో కాస్త అట్టర్ ఫ్లాప్ అయ్యింది.స్టార్ మాకి భారి నష్టాలు వచ్చాయి.
ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ ని అనౌన్స్ చేయగానే ఎన్నో అనుమానాలు.ఆల్రేడి హిట్ అయిన షోనే మెగాస్టార్ లాగాలేకపోయారు, బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్లకి కొత్త, పైగా రాత్రుళ్ళు సీరియల్స్ తప్ప ఇంకేమి ఆడని తెలుగు ఇంట్లో ఇలాంటి వివాదాలతో నిండిన షో ఎవరు చూస్తారు అని అనుకున్నారు.
కాని ఈ అంచనాలకు మించి క్లిక్ అయ్యింది.అలాగని చెప్పి, ఇది ఆట ఆడుతున్న వాళ్ళ వలన ఇంత సూపర్ హిట్ అయ్యింది, వారి గొడవలు, కామెడి కోసమే జనాలు చూస్తున్నారు అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే వీక్ డేస్ లో ఏ కారణంతో ఆడినా, వీకెండ్ మాత్రం ఎన్టీఆర్ కోసమే చూస్తున్నారు.మీకెలా తెలుసు అంటే సాక్ష్యాలు ఉన్నాయి.
బిగ్ బాస్ షో మొదలవడానికి ముందు వారం స్టార్ మా BARC పాయింట్లు 567 కాగా, బిగ్ బాస్ మొదటి వారంలో ఈ పాయింట్ల సంఖ్య 732కి చేరుకుంది.ఆ వారంలో అన్ని ప్రముఖ తెలుగు చానెళ్ళు కలిపి 252 సాధిస్తే, అందులో ఒక్క స్టార్ మా సాధించినవి 168 పాయింట్లు కావడం విశేషం.ఆ వారం మొత్తంలో సగటున 10.4 TVR పాయింట్స్ సాధించింది బిగ్ బాస్.అందులో తారక్ లేని వీక్ ఎపిసోడ్లు 6.93 TVR సాధించగా, తారక్ ఉన్న వీకెండ్ ఎపిసోడ్ (ఆదివారం) ఏకంగా 16.18 TVR సాధించింది.ఇది తెలుగు టీవి చరిత్రలో ఓ రికార్డు.
ఇంతవరకు ఏ షోకి సంబంధించిన ఏ ఎపిసోడ్ కి కూడా ఇంత రేటింగ్ రాలేదు.దెబ్బకి స్టార్ మా తెలుగు చానెళ్ళలో నెం.1 స్థానానికి చేరుకుంది.ఆలాగే ఇండియా మొత్తంలో 5వ ర్యాంకు సాధించింది.
చిరంజీవి హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ మొదటి వారం కేవలం 5.24 TVR సాధించగా, ఈ షో కి సంబంధించిన ఏ ఎపిసోడ్ కూడా 10 TVR దాటలేదు ఎప్పుడు.ఇక రానా హోస్ట్ చేస్తున్న నెం.1 యారి సడెన్ గా పుంజుకుంది.బిగ్ బాస్ ప్రసారమైన ఆదివారమే ఈ షో TVR 9.89.అంటే జబర్దస్ట్ తరువాతి స్థానం (మూడోవ స్థానం)
.