మూత్రంలో మంట‌కు కార‌ణాలేంటి.. ఈ స‌మ‌స్య‌ను స‌హ‌జంగా ఎలా త‌గ్గించుకోవ‌చ్చు..?

మూత్ర విసర్జన చేసినప్పుడు కొంద‌రికి మంట‌గా అనిపిస్తుంటుంది.దీనిని డైసూరియా అని అంటారు.

పురుషులు మరియు మహిళలు ఏ వయస్సులోనైనా ఈ స‌మ‌స్య‌ను అనుభవించవచ్చు.ప్ర‌ధానంగా మహిళల్లో డైసూరియా( Dysuria ) కనిపిస్తుంది.

డైసూరియా కార‌ణంగా తీవ్ర అసౌక‌ర్యానికి, బాధ‌కి గుర‌వుతుంటారు.అస‌లు మూత్రంలో మంట‌కు కార‌ణాలేంటి.? ఈ స‌మ‌స్య‌ల‌ను స‌హ‌జంగా ఎలా త‌గ్గించుకోవ‌చ్చు.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మూత్రంలో మంట‌కు అనేక కారణాలు ఉన్నాయి.మూత్రనాళంలో పీహెచ్ లో తేడాలు, నీళ్లు తక్కువగా తాగడం, యోని ఇన్ఫెక్షన్‌, యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్స్‌, త‌ర‌చూగా ప‌బ్లిక్ టాయిలెట్స్ ను వినియోగించ‌డం, అపరిశుభ్రమైన లోదుస్తులు వాడ‌టం, మూత్రంలో బ్యాక్టీరియా పెర‌గ‌డం, మూత్రాశయం లేదా మూత్రనాళం యొక్క వాపు, మూత్రపిండాల్లో రాళ్లు, లైంగిక సంపర్కం, డయాబెటీస్ త‌దిత‌ర అంశాలు మూత్ర విసర్జన స‌మ‌యంలో మంట‌, నొప్పికి దారితీస్తాయి.

Advertisement

మూత్రంలో మంట త‌గ్గ‌డానికి కొన్ని కొన్ని ఇంటికి చాలా బాగా స‌మాయ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా ఉల్లి టీ( onion tea ) మూత్రంలో మంటను స‌మ‌ర్థ‌వంతంగా త‌గ్గిస్తుంది.ఉల్లిపాయ‌ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి వాట‌ర్ లో మ‌రిగించి.

ఆ నీటిని రోజుకు ఒక‌టి లేదా రెండు సార్లు తీసుకుంటే మూత్రంలో మంట అన్న మాటే అన‌రు.అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.

ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలపి తాగితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా నాశ‌న‌మ‌వుతుంది.దాంతో మూత్రంలో మంట త‌గ్గుతుంది.

మూత్రంలో మంట స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.మ‌రియు కొబ్బ‌రి నీళ్లు, మ‌జ్జిగ,( Coconut Water ) లెమ‌న్ జ్యూస్ వంటివి త‌ర‌చూ సేవించాలి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

పుష్కలంగా నీరు, ఇతర ద్రవాలు తాగ‌డం వ‌ల్ల మూత్ర నాళంలోని బ్యాక్టీరియా తొల‌గిపోతుంది.అంతేకాకుండా విట‌మిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోండి.

Advertisement

శుభ్ర‌మైన లోదుస్తుల‌ను వాడాలి.వ్య‌క్తిగత ప‌రిశుభ్ర‌త పాటించాలి.

జననావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.ఆల్కహాల్, కెఫిన్ పానీయాలు, కార్బోనేటేడ్ పానీయాలు మరియు స్పైసీ ఫుడ్స్‌ మీ మూత్రాశయానికి చికాకు క‌లిగిస్తుంది.

కాబ‌ట్టి అటువంటి వాటికి దూరంగా ఉండండి.

తాజా వార్తలు