అండర్ ఆర్మ్స్ తెల్లగా, మృదువుగా మారాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి!

సాధారణంగా చాలా మందికి అండర్ ఆర్మ్స్ అనేది డార్క్ గా ఉంటాయి.

అమ్మాయిలు డార్క్ అండర్ ఆర్మ్స్( Dark Underarms ) కారణంగా చాలా ఇబ్బంది పడుతుంటారు.

స్లీవ్ లెస్ దుస్తులు ధరించేందుకు అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.ఈ క్రమంలోనే అండర్ ఆర్మ్స్ ను వైట్ గా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.ఈ టిప్స్ తో అండర్ ఆర్మ్స్ ను తెల్లగా మృదువుగా మార్చుకోవచ్చు.

రెమెడీ 1:

ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి.ఆపై పది నిమిషాలు ఆరబెట్టుకొని అప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

తరచూ ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల అండర్ ఆర్మ్స్ లో నలుపు క్రమంగా మాయమవుతుంది.అక్కడి చర్మం తెల్లగా మృదువుగా మారుతుంది.మరియు అండర్ ఆర్మ్స్ నుండి వ‌చ్చే దుర్వాసనకు సైతం ఈ రెమెడీ చెక్ పెడుతుంది.

రెమెడీ 2:

ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Turmeric ) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ పెరుగు, వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు రెండు టీ స్పూన్లు పొటాటో జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో శుభ్రంగా అండర్ ఆర్మ్స్ ను క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే నలుపు పూర్తిగా తొలగిపోతుంది.

ఒక్క వీడియోతో అంచనాలు పెంచేసిన బన్నీ అట్లీ.. మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్!
మరో ఇద్దరు పాన్ ఇండియా డైరెక్టర్లను లైన్ లో పెట్టిన అల్లు అర్జున్...

అండర్ ఆన్సర్ వైట్ గా మరియు స్మూత్ గా మారుతాయి.

Advertisement

రెమెడీ 3:

ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొబ్బరి నూనె కూడా అండర్ ఆర్మ్స్ నలుపును వదిలించగలదు.రోజు స్నానం చేయడానికి గంట ముందు కొబ్బరినూనెను అండర్ ఆర్మ్స్‌ లో అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా చేశారంటే మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు