స్త్రీల‌ను త‌ర‌చూ వేధించే నడుమునొప్పి..ఇలా చేస్తే ప‌రార్‌!

స్త్రీలు త‌ర‌చూ ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో న‌డుము నొప్పి ఒక‌టి.

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, పోష‌కాల లోపం, నెల‌స‌రి, ప్రసవం త‌ర్వాత శ‌రీరంలో వ‌చ్చే మార్పులు, వెన్నెముకపై ఒత్తిడి పెర‌గడం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల స్త్రీలు న‌డుము నొప్పిని ఎదుర్కొంటుంటారు.

దాంతో ఈ నొప్పిని ఎలా నివారించాలో తెలియ‌క‌.పెయిన్ కిల్ల‌ర్స్ వాడుతుంటారు.

అయితే పెయిన్ కిల్ల‌ర్స్ అధికంగా వాడ‌టం కూడా ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.అందుకే న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల్లో న‌డుము నొప్పిని త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

న‌డుము నొప్పిని త‌గ్గించ‌డంలో వెల్లుల్లి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల‌ను మెత్త‌గా నూరుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల నువ్వుల నూనె, రెండు స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ క‌లుపుకుని వేడి చేయాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత నొప్పిగా ఉన్న చోట అప్లై చేసి.

ఇర‌వై, ముప్పై నిమిషాల అనంత‌రం వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే న‌డుము నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

గ‌స‌గ‌సాలు కూడా న‌డుము నొప్పిని త‌గ్గించ‌గ‌ల‌వు.గ‌స‌గ‌సాల‌ను లైట్‌గా డ్రై రోస్ట్ చేసిమెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఓ గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో అర స్పూన్ గ‌స‌గ‌సాల పొడి క‌లిపి సేవించాలి.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
వివాదాల నడుమ నయనతార డాక్యుమెంటరీ పై మహేష్ కామెంట్స్.. అంత నచ్చేసిందా?

ఇలా రోజుకు రెండు సార్లు చేస్త న‌డుము నొప్పి క్ర‌మంగా త‌గ్గి పోతుంది.అలాగే న‌డుము నొప్పి వేధిస్తున్న‌ప్పుడు ఐస్ ముక్క‌ల‌ను క్లాత్‌లో చుట్టి కాప‌డం పెట్టుకోవాలి.

Advertisement

ఇలా చేస్తే నొప్పి నుంచి కొద్ది సేప‌టికే ఉప‌శ‌మ‌నం పొందుతాడు.ఇక ఈ టిప్స్‌తో పాటు మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు కూడా పాటించాలి.

ముఖ్యంగా ఎక్కువ స‌మ‌యం పాటు ఒకే చోట కుర్చోవ‌డం, నిల‌బ‌డ‌టం, ప‌డుకోవ‌డం చేయ‌రాదు.మ‌రియు రెగ్యుల‌ర్‌గా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.

పౌష్టికాహారం తీసుకోవాలి.

తాజా వార్తలు