Dandruff Tips : సింపుల్ టిప్స్‌తో చుండ్రును తగ్గించుకోవచ్చు..

అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా జుట్టు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

జుట్టు చిట్లడం, రాలడం, తెల్లబడడం వంటి సమస్యలతో పాటు చుండ్రు సమస్య ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది.

నలుగురిలో ఉన్నప్పుడు కూడా జుట్టులో నుంచి తెల్లగా చుండ్రు రాలుతుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.తల పై తెల్లగా చుండ్రు ఉండడం చూస్తే ఏదో తెలియని బాధగా ఉంటుంది చుండ్రు సమస్య ఉన్నవారికి.

అయితే చాలా సింపుల్ టిప్స్ తో ఈ పెద్ద సమస్యని ఇట్టే తరిమి కొట్టవచ్చు.ఒకసారి అంత ఈజీ టిప్స్ ఏంటో చకాచకా చూసేద్దాం.

Home Remedies To Cure Dandruff Naturally,dandruff,hair Tips, Home Remedies,hair

వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు.దురదను తగ్గించడమే కాదు.డాండ్రఫ్ పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది.

Advertisement
Home Remedies To Cure Dandruff Naturally,Dandruff,Hair Tips, Home Remedies,Hair

రెండు గుపిళ్ల నిండుగా వేపాకు తీసుకొని 4-5 కప్పుల వేడి నీటిలో వేసి రాత్రంతా అలా వదిలేయండి.మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తలను కడిగేసుకోండి.

మిగిలిపోయిన వేపాకులను పేస్ట్‌గా చేసుకొని మాడుకు పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేసినా ఫలితం ఉంటుంది.ఆపిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు.

ఫంగస్‌ను నాశనం చేయడంలో ఇది ఎంతో ఉపకరిస్తుంది.ఇందుకోసం వెనిగర్, నీటిని సమపాళ్లలో కలపాలి.

దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు.ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల డాండ్రఫ్‌ను కూడా అరికట్టవచ్చు.

Home Remedies To Cure Dandruff Naturally,dandruff,hair Tips, Home Remedies,hair
రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

షాంపూ చేసుకున్న తర్వాత సరిపడా నీటితో తలను శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా తల మీద నూనె, మృత కణాలు తొలగిపోవు.ఫలితంగా అది డాండ్రఫ్‌కు దారితీస్తుంది.తక్కువ గాఢత ఉండే షాంపూతో తరచుగా తలంటుకోవాలి.

Advertisement

షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ రాసుకునే అలవాటు ఉంటే.దాన్ని మాడుకు అంటకుండా చూసుకోండి.

ఆస్పిరిన్ ట్యాబ్లెట్లతోనూ డాండ్రఫ్‌ను అరికట్టవచ్చు.రెండు ఆస్పిరిన్ ట్యాబ్లెట్లను నలిపి న్యాప్‌కిన్‌లో ఉంచి ముక్కలుగా చేయాలి.

తర్వాత ఆ పొడిని గిన్నెలోకి తీసుకొని రెగ్యులర్‌గా వాడే షాంప్‌ను కొద్దిగా ఆ పొడికి కలపాలి.ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నిమిషాలయ్యాక నీటితో కడిగేసుకోవాలి.

కొబ్బరి నూనెతోనూ డాండ్రఫ్‌ను తరిమేయొచ్చు.కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది.ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 - 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి.

తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది.తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి.నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది.

నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి.లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.

డాండ్రఫ్ తగ్గే వరకూ రోజూ ఇలా చేయాలి.పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా డాండ్రఫ్ తగ్గుముఖం పడుతుంది.

ఇందుకోసం పెరుగును తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి.తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేసుకోవాలి.

ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.చూశారు గా చాలా సింపుల్ గా ఈజీగా మీ చుండ్రుకు ఇట్టే పరిష్కారం దొరికిపోతుంది.

ఒకసారి ప్రయత్నించి చూడండి.కానీ కొంత మందికి కొన్ని రకాల షాంపూలు నూనెలు పడవు కాబట్టి మీ హెయిర్ కి తగ్గ నూనెలను షాంపులను వాడడం మంచిది.

" autoplay>

తాజా వార్తలు