ఒళ్లు నొప్పుల‌ను సులువుగా త‌గ్గించే వంటింటి చిట్కాలు ఇవే!

నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఒళ్లు నొప్పుల (బాడిపెయిన్స్‌)ను ఫేస్ చేసే ఉంటారు.

ఏక కాలంలో అనేక ప‌నులు చేస్తూ.

బిజీ లైఫ్‌ను లీడ్ చేసే వారిలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.అయితే ఒళ్లు నొప్పులు వ‌చ్చాయంటే.

దాదాపు తొబై శాంతం మంది పెయిన్ కిల్ల‌ర్స్ వేసేసుకుంటారు.కానీ, అలా చేయ‌డం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

దీర్ఘ‌కాలంగా పెయిన్ కిల్ల‌ర్స్ యూజ్ చేయ‌డం వ‌ల్ల కిడ్నీ స‌మ‌స్య‌లు, లివ‌ర్ డ్యామేజ్, ‌డిప్రెషన్ ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.అందుకే పెయిన్ కిల్ల‌ర్స్‌కు దూరం ఉండండి.

Advertisement

మ‌రి ఒళ్లు నొప్పులు ఎలా త‌గ్గేది అంటే.నిజానికి న్యాచుర‌ల్‌గా కూడా త‌గ్గించుకోవ‌చ్చు.

అదెలానో ఓ లుక్కేసేయండి.సుగంధ ద్ర‌వ్యాల్లో ఒక‌టైన దాల్చిన చెక్క ఒళ్లు నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఎందుకంటే, దాల్చిన చెక్క‌లో నొప్పిల‌ను త‌గ్గించే యాంటీ ఇన్‌ప్లమేట‌రీ, అనాల్జ‌సిక్ అనే గుణాలు ఉన్నాయి.అందువ‌ల్ల‌, ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో కొద్దిగా దాల్చిన చెక్క పొడి మ‌రియు తేనె క‌లుపుకుని సేవిస్తే మంచిది.

అలాగే అల్లం కూడా ఒళ్లు నొప్పుల‌ను త‌గ్గించ‌గ‌ల‌వు.ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం తురుము వేసి బాగా మరిగించాలి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

అనంత‌రం ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే ఎంతటి ఒళ్లు నొప్పులైనా ప‌రార్ అవ్వాల్సిందే.

Advertisement

ఇక ఒళ్లు నొప్పుల‌తో బాధ ప‌డేవారు వేడి వేడి నీటితో స్నానం చేసే మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.అలాగే ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉన్న‌ప్పుడు రోజ్ మేరీ నూనెను శరీరానికి అప్లై చేసి.కాసేపు మ‌సాజ్ చేయించుకున్నా త‌గ్గుతాయి.

లేదా లావెండ‌ర్ నూనె మ‌రియు కొబ్బ‌రి నూనె క‌లిపి మ‌సాజ్ చేయించుకున్నా నొప్పులు త‌గ్గుతాయి.

తాజా వార్తలు