టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటించిన లేటెస్ట్ సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 2.
హిట్ 1 సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించు కుంది.ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించారు.వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన సినిమాల్లో హిట్ 1 ఒకటి.
ఇక ఈ సినిమా సక్సెస్ ఫుల్ అవ్వడంతో మళ్ళీ నాని సీక్వెల్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు.అయితే ఈసారి హీరోగా విశ్వక్ సేన్ కాకుండా అడవి శేష్ ను తీసుకున్నారు.
ఇదే ఈ సినిమాకు ఇప్పుడు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.ఎందుకంటే అడవిశేష్ ఇటీవలే మేజర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.
దీంతో హిట్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అలాగే ప్రొమోషన్స్ కూడా బాగా చేయడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.
మొన్న శుక్రవారం డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా యూఎస్ లో కూడా భారీ బజ్ తో రిలీజ్ అయ్యింది.
ఇక ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే తోనే ఈ సినిమా అక్కడ హాఫ్ మిలియన్ ను క్రాస్ చేసింది.దీంతో మూడు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ దిశగా హిట్ 2 దూసుకు వెళ్తుంది. రెండవ రోజు 6 లక్షల 50 వేల డాలర్స్ కు చేరుకున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది.
ఇదే జరిగితే ఏ సర్టిఫికెట్ తోనే 1 మిలియన్ అందుకున్న రెండవ టాలీవుడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy