బాలయ్యకు కోరిక ఉన్నా తీరుతుందా?

గుమ్మడి కాయల దొంగ అని ఎవరు అనక ముందే హీరో కం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ భుజాలు తడుముకున్నారు.

తాను ముఖ్యమంత్రి అవాలని రాజకీయాలలోకి రాలేదన్నారు.

అంటే ప్రజా సేవ చేయడానికి వచ్చాడని అర్థం.తాను ముఖ్యమంత్రి పదవి ఎన్నడూ ఆశించలేదని చెప్పారు.

ప్రతీ నాయకుడు చెప్పే మాటే బాలయ్య కూడా చెప్పారు.ఒక వేల సీఎం కావాలనే కోరిక ఉన్నా అది తీరే అవకాశం ఎంత మాత్రం లేదని చెప్పొచ్చు.

చంద్రబాబు తన కుమారుడిని తనకు వారసుడిగా సిద్ధం చేస్తున్నారు.లోకేష్ కొడుకుగా మాత్రమే కాకుండా సీఎమ్ గా కూడా వారసుడే అవుతాడు.

Advertisement

ఇప్పటికే ఆటను పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.తొందరలో ప్రధాన కార్యదర్శి కూడా అవుతాడని సమాచారం.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.పార్టీ నాయకుల్లో ఎక్కువమంది లోకేష్ భజన చేస్తున్నారు.

ఆయన పనితీరును పొగుడుతున్నారు.లోకేష్ చూపుల కోసం తపిస్తున్నారు.

కాబోయే సీఎమ్ ఆయనేని అంటున్నారు.కాబట్టి బాలయ్యకు సీఎమ్ కావాలనే కోరిక ఉన్నా తీరదు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!

అందులోనూ పిల్లను ఇచ్చిన మామగా లోకేష్ తో పోటీ పడటానికి ఇష్టపడడు.ఇదిలా ఉండగా తన బావ చంద్రబాబు గొప్ప పరిపాలకుడని బాలయ్య ప్రశంసలు కురిపించారు.

Advertisement

బావ పరిపాలనలో లోపాలు ఉన్నా పైకి చెప్పలేదు కదా.

తాజా వార్తలు