తెలంగాణలో టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే

తెలంగాణలో టీచర్ల బదిలీలపై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది.ఈ మేరకు ఈనెల 19వ తేదీ వరకు న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా టీచర్ల లంచ్‌మోషన్‌ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీపై ఈనెల 19 వరకు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.పదోన్నతుల తరువాతే బదిలీలు చేయాలన్న పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పటివరకూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని రాష్ట్ర హైకోర్టు సూచించింది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు