తెలంగాణలో 25 మంది ఎమ్మెల్యేల ఎన్నికల పిటిషన్ పై హైకోర్టు విచారణ

తెలంగాణలో 25 మంది ఎమ్మెల్యేల ఎన్నికల పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది.2018 ఎన్నికలపై న్యాయస్థానంలో పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో హైకోర్టు ఏ తీర్పు ఇస్తుందా అన్న వ్యవహారంపై నేతల్లో అలజడి నెలకొందని తెలుస్తోంది.

ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యేపై తీర్పుతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుతం హైకోర్టులో 25కు పైగా పెండింగ్ పిటిషన్ లు ఉన్నాయి.శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేశ్, మర్రి జనార్ధన్, ముత్తిరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొందరిపై ఎలక్షన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.

ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పును వెలువరించింది.అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ పై దాఖలైన పిటిషన్ విచారణ ప్రారంభం కాగా.

కొప్పుల ఈశ్వర్ పై దాఖలైన పిటిషన్ పై వచ్చే మంగళవారం విచారణ జరగనుంది.అదేవిధంగా గంగుల కమలాకర్ ఎన్నికపై బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ పిటిషన్లు దాఖలు కాగా దీనిపై ఈనెల 12 నుంచి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు