ఆ హీరోయిన్ సెంటిమెంట్ పవన్ వకీల్ సాబ్ ని హిట్ చేస్తుందట...

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగులో "వకీల్ సాబ్" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 ఈ చిత్రానికి ఎంసీఏ చిత్ర దర్శకుడు దర్శకత్వం వహిస్తుండగా తెలుగమ్మాయి అంజలి, యంగ్ హీరోయిన్ నివేథా థామస్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

కాగా సంక్రాంతి పండుగ కానుకగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు.అయితే ఈ టీజర్ ని  విడుదల చేసిన అతికొద్ది సమయంలోనే కోట్ల సంఖ్యలో వ్యూస్ మరియు లైకులు, కామెంట్లు వచ్చాయి.

అంతేగాక ఈ సారి పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ధీమాతో ఉన్నారు.అయితే ఈ టీజర్ ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ టీజర్ లో హీరోయిన్ శృతి హాసన్ గురించి ఎలాంటి సన్నివేశాలు లేకపోవడంతో శృతి హాసన్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

 దీంతో మరి కొంతమందయితే ఏకంగా వకీల్ సాబ్ చిత్రంలో అసలు శృతి హాసన్ ఉందా.  లేదా.? అంటూ  కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

కానీ ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.అయితే గతంలో శృతి హాసన్ మరియు పవన్ కళ్యాణ్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ మరియు కాటమ రాయుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యాయి. దీంతో మరోమారు శ్రుతి హాసన్ సెంటిమెంట్ ఈ సినిమాకీ వర్కవుట్ అవుతుందని కొంతమంది సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుండడంతో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ పనులను పూర్తి చేసుకోవడంతో తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న మరో  చిత్రంలో కూడా హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు