అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో షాలినీ పాండే( Shalini Pandey ) మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కెరీర్ పుంజుకున్న స్థాయిలో షాలిని పాండే కెరీర్ మాత్రం పుంజుకోలేదు.

అర్జున్ రెడ్డి సినిమా నేను కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమా అని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సినిమా గురించి ఇప్పుడు ఆలోచిస్తే మాత్రం అమాయకంగా ఉంటుందని ఆమె వెల్లడించారు.

ఆ సినిమాలో నా పాత్రను మరింత బలంగా చేయొచ్చేమో అని అనుకుంటానని ఆమె కామెంట్లు చేశారు.మరోసారి అలాంటి రోల్ వస్తే మాత్రం నో చెప్పనని షాలిని పాండే పేర్కొన్నారు.

దానిపై మరింత అవగాహన పెంచుకుని నటిస్తానని షాలిని పాండే చెప్పుకొచ్చారు.

Heroine Shalini Pandey Comments About Arjun Reddy Movie Preethi Role Details, He
Advertisement
Heroine Shalini Pandey Comments About Arjun Reddy Movie Preethi Role Details, He

అప్పటికంటే ఇప్పుడు నటిగా పరిణతి చెందాను కాబట్టి భిన్నంగా చేయడానికి నేను ప్రయత్నిస్తానని ఆమె పేర్కొన్నారు.నిజాయితీగా మాట్లాడాలంటే డైరెక్టర్ తో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకుని అంగీకరిస్తానని షాలిని పాండే అభిప్రాయపడ్డారు.షాలిని పాండే కెరిరి పరంగా బిజీ అయ్యి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటూ ఉండటం గమనార్హం.

Heroine Shalini Pandey Comments About Arjun Reddy Movie Preethi Role Details, He

డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ లో షాలిని పాండే రాజి అనే రోల్ లో నటించి మెప్పించారు.షాలిని పాండే నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.షాలిని పాండేను అభిమానుంచే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

షాలిని పాండే కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.షాలిని పాండే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో లక్ పరీక్షించుకుంటున్నారు.

నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.

చిన్నప్పుడే లైంగిక వేధింపులు... కన్నీళ్లు పెట్టుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్! 
Advertisement

తాజా వార్తలు