ఛాన్స్ వస్తే అలాంటి సీన్లు చేస్తాను.. రీతూ వర్మ షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో రీతూ వర్మ ( ritu varma )ఒకరు.

బాద్ షా( Bad Shah ) సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన ఈ నటి పెళ్లి చూపులు, టక్ జగదీష్, శ్వాగ్ సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకోగా మజాకా సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించారు.

ఈ నటి తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ముద్దు సన్నివేశాలకు సంబంధించిన సినిమాల్లో నాకు అవకాశం రాలేదని ఆమె అన్నారు.

కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్ లో యాక్ట్ చేయడానికి నేను ఏ మాత్రం ఇబ్బంది పడనని రీతూవర్మ చెప్పుకొచ్చారు.నేను అలాంటి పాత్రలు చేయనని కొంతమంది ఒక నిర్ణయానికి వచ్చారని రీతూ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆ రీజన్ వల్లే నా దగ్గరకు అలాంటి కథలు రావడం లేదని అనుకుంటానని ఆమె పేర్కొన్నారు.

Heroine Ritu Varma Comments About Kiss Scenes Details Inside Goes Viral In Soc
Advertisement
Heroine Ritu Varma Comments About Kiss Scenes Details Inside Goes Viral In Soc

స్వాగ్ సినిమా( Swag movie ) ఫెయిల్యూర్ గురించి రీతూ వర్మ మాట్లాడుతూ ఆ సినిమా అందరికీ సంబంధించి కాదని మేము ముందు నుంచే అనుకున్నామని ఆమె తెలిపారు.ఆ కథలో ఉన్న తీవ్రత చాలామందికి అర్థం కాలేదని రీతూ వర్మ వెల్లడించారు.అయినా పరవాలేదని ఎందుకంటే మనం నటించే అన్ని సినిమాలను ప్రేక్షకులను ఆదరించాలని లేదని రీతూ వర్మ పేర్కొన్నారు.

Heroine Ritu Varma Comments About Kiss Scenes Details Inside Goes Viral In Soc

పెళ్లి చూపులు సినిమా( Pelli chupulu ) నాకు ప్రత్యేకమైన సినిమా అని ఆమె చెప్పుకొచ్చారు.చిన్న బడ్జెట్ లో ఆ సినిమా చేశామని ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఎప్పుడూ ఊహించలేదని రీతూ వర్మ కామెంట్లు చేశారు.ఒక మంచి మూవీ చేస్తున్నామనే నమ్మకంతో దానిని పూర్తి చేశామని ఆమె తెలిపారు.

పెళ్లి చూపులు రిలీజ్ తర్వాత మా అందరి జీవితాలను మార్చేసిందని ఆమె తెలిపారు.తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సీక్వెల్ కూడా తెరకెక్కిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అని రీతూ వర్మ వెల్లడించారు.

ఆ ఆలోచన వచ్చిన తొలి హీరో చిరంజీవి.. ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు