వాటిపై దృష్టి పెడితే సరిగ్గా నటించలేను.. హీరోయిన్ ఆదాశర్మ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆదాశర్మ( Adah Sharma ) ఒకరు.

తక్కువ సినిమాలే చేసినా తన నటనతో పాపులారిటీని పెంచుకున్న ఆదాశర్మ కొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్, మరికొన్ని సినిమాలలో థర్డ్ హీరోయిన్ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

ఒక సినిమా ఆదరణ సొంతం చేసుకోలేదంటే అందుకు సంబంధించి ఎన్నో కారణాలు ఉంటాయని ఆదాశర్మ తెలిపారు.మంచి సినిమాను అందిస్తున్నామా లేదా అని మాత్రమే నేను చూస్తానని ఆమె పేర్కొన్నారు.

నాకు వచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేస్తున్నానా లేదా అని మాత్రమే ఆలోచిస్తానని ఆదాశర్మ పేర్కొన్నారు.బాక్సాఫీస్ నంబర్లపై దృష్టి పెడితే సరిగ్గా నటించలేనని ఆమె తెలిపారు.

ది కేరళ స్టోరీ( The Kerala Story ) సినిమాలో నటించే సమయంలో ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని అనుకోలేదని ఆదాశర్మ తెలిపారు.

Heroine Adah Sharma Comments About Box Office Numbers Details, Adah Sharma, Hero
Advertisement
Heroine Adah Sharma Comments About Box Office Numbers Details, Adah Sharma, Hero

ది కేరళ స్టోరీ లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినప్పటికీ ఏకంగా 378 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసిందని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సినిమాలో నటించే సమయంలో కూడా నేను బాక్సాఫీస్ నంబర్ల గురించి ఆలోచించలేదని ఆదాశర్మ పేర్కొన్నారు.నా పాత్ర ఎలా చేస్తున్నాను అనేది మాత్రమే నేను చూశానని ఆమె చెప్పుకొచ్చారు.

Heroine Adah Sharma Comments About Box Office Numbers Details, Adah Sharma, Hero

బస్తర్ : ది నక్సల్ స్టోరీ( Bastar The Naxal Story ) ప్రమోషన్స్ లో భాగంగా ఆదాశర్మ ఈ విషయాలను వెల్లడించారు.ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమాలో ఆదాశర్మ ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్ పాత్రలో కనిపించి మెప్పించారు.

ఆదాశర్మ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.స్టార్ హీరోయిన్ ఆదాశర్మ పారితోషికం ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.మంచి పాత్రలు దొరికిన ప్రతి సందర్భంలో హీరోయిన్ ఆదాశర్మ ప్రూవ్ చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

మెగా ఫ్యామిలీ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు