మంత్రి పొంగులేటికీ, హీరో వెంకటేశ్‌కూ ఉన్న లింక్ ఇదే?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి అందరికీ తెలిసినదే.అదే విధంగా ఇక్కడ టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గురించి కూడా విదితమే.

అయితే వీరిద్దరి మధ్య బంధుత్వం ఉందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) అంటే తెలంగాణ ప్రజలకు మంచి గురి.2014 నుండి 2019 వరకు ఆయన ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.అంతకు ముందు ఎన్నో ఏళ్ళు ఆయన వ్యవసాయదారుడిగా పనిచేశాడు.1984లో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ విద్యను, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్యలో బిఏ డిగ్రీని పూర్తి చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పట్లోనే రాజకీయంగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఉండేదట.

Hero Venkatesh Relation With Minister Ponguleti , Minister Ponguleti , Hero Venk

ఈ క్రమంలోనే ఆయన 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో పేరువంచ మేజర్‌పై క్రాస్‌వాల్‌( Crosswall on Major ) నిర్మాణం చేయడం జరిగింది.ఆ క్రాస్‌వాల్‌ నిర్మాణం వల్లనే 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని తెలంగాణ ప్రజలు చెప్పుకుంటారు.అలా కాంట్రాక్టర్‌గా మారి ప్రభుత్వం తరపున అనేక నిర్మాణాలు చేపట్టాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

అలా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ, వివిధ హోదాల్లో పని చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.కొంతకాలం తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ తరపున ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి, టీడీపీ అభ్య‌ర్థి నామా నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు.ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.

Hero Venkatesh Relation With Minister Ponguleti , Minister Ponguleti , Hero Venk
Advertisement
Hero Venkatesh Relation With Minister Ponguleti , Minister Ponguleti , Hero Venk

అయితే ఇంతకీ ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికీ హీరో వెంకటేశ్‌కూ చుట్టరికం ఏమిటనేగా మీ అనుమానం? అక్కడికే వస్తున్నాం.వీరి మధ్యలో ఇక్కడ రఘురామ్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి.లేదంటే వీరి మధ్య బంధుత్వం కుదిరేది కాదు.

రఘురామ్ రెడ్డి( Raghuram Reddy ) సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్‌గా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్‌గా ఉన్న సంగతి విదితమే.ఈ రఘురామ్ పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి ప్రముఖ నటుడు వెంకటేశ్ పెద్ద కూతురు అయినటువంటి అశ్రితను పెళ్లి చేసుకోవడం జరిగింది.

కాగా రఘురామ్ రెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డిని వివాహం చేసుకున్నాడు.ఆ రకంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికీ హీరో వెంకటేశ్‌కూ చుట్టరికం ఏర్పడింది.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు