ఇప్పుడేం సినిమాలు లేవు.. ఖాళీగానే ఉన్నా.. వెంకటేష్ షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరో వెంకటేష్ ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు.

అసురన్ రీమేక్ నారప్పతో హిట్ కొట్టిన వెంకటేష్ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన దృశ్యం2 ను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు.

ఈ నెల 25వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం2 తెలుగు వెర్షన్ రిలీజ్ కానుండటం గమనార్హం.చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఏపీలో టికెట్ రేట్లు పెరగకపోవడం, ప్రేక్షకులలో కొంతమంది థియేటర్ల వైపు అడుగులు వేయడంతో దృశ్యం2 ఓటీటీ బాట పట్టినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఎఫ్3 సినిమాలో నటిస్తున్న వెంకటేష్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ వెంకటేష్ సీనియర్ హీరోగా కూడా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.ఎఫ్3 సినిమా థియేటర్లలోనే రిలీజ్ కానుండగా దృశ్యం2 ప్రమోషన్స్ లో భాగంగా విక్టరీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ నెల 25వ తేదీన దృశ్యం2 ప్రైమ్ లో రిలీజ్ కానుంది.దృశ్యం పార్ట్1 కంటే రెండో పార్ట్ స్క్రిప్ట్ అద్భుతంగా కుదిరిందని రాంబాబు పాత్రలో మరోసారి నటించినందుకు సంతోషంగా ఉందని వెంకటేష్ అన్నారు.దృశ్యం2 సినిమాలో ఒరిజినల్ తో పోలిస్తే ఐదు సీన్లను అదనంగా యాడ్ చేశామని వెంకటేష్ పేర్కొన్నారు.సినిమా రిలీజ్ విషయంలో ఇన్వాల్వ్ కానని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

దృశ్యం పార్ట్3 ఉంటుందో లేదో తనకు తెలియదని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

Advertisement

ఇమేజ్ గురించి తాను ఆలోచించనని కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తానని వెంకటేష్ తెలిపారు.యంగ్ డైరెక్టర్లు కథలు చెబుతున్నారని కొత్తగా ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వెంకటేష్ అన్నారు.పని లేనప్పుడు ఖాళీగా సంతోషంగా ఉందామని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు