బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా చేయనున్న ఆ స్టార్ హీరో..?

తెరఫై వస్తున్నా షోస్ లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న షో లలో బిగ్ బాస్( Bigg Boss ) ఒకటి.

ఈ షో కి ఫస్ట్ సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసాడు.

ఈ షో తోనే ఎన్టీఆర్ బెస్ట్ హోస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు అలాగే ఈ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అయింది.కానీ ఎన్టీఆర్ ( NTR ) సినిమాలతో బిజీ గా ఉండడం వల్ల అటు సినిమాలకి ఇటు బిగ్ బాస్ షో కి డేట్స్ అడ్జస్ట్ చేయలేక హోస్టింగ్ నుంచి తప్పుకున్నారు.

దాంతో సెకండ్ సీజన్ కి నాని ( Nani ) హోస్ట్ గా చేసాడు ఈ సీజన్ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది.కానీ ఆ తర్వాత సీజన్ కి నాని కూడా అందుబాటు లో లేకపోవడంతో యాజమాన్యం నాగార్జునకి ( Nagarjuna ) హోస్ట్ గా బాధ్యతలు అప్పగించింది అప్పటి నుంచి ఇప్పటి సీజన్ 6 వరకు కూడా నాగార్జునే హోస్ట్ గా చేసాడు దింతో షో కూడా మంచి సక్సెస్ సాధించింది.

కానీ ఈ సీజన్ 6 మాత్రం మిగితా సీజన్స్ తో పోల్చుకుంటే అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాలనుకోవడం లేదు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Advertisement

కొందరు చెప్తున్నా దాని ప్రకారం బిగ్ బాస్ షో అంటే బోర్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తుండగా, ఇంకొందరు నాగార్జునకి షోలో అంత పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తున్నప్పుడు ఎందుకు వదులుకుంటారు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్ బాస్ యాజమాన్యంపై నాగార్జున కోపంగా ఉన్నారని, బిగ్ బాస్ షో నిర్వహకులపై నాగార్జున తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ఎందుకంటే బిగ్ బాస్ షో కి సంబంధించిన లీకులు నాగార్జునకు చిరాకు తెప్పిస్తున్నాయట వాటిని ఆపడంలో బిగ్ బాస్ యాజమాన్యం విఫలమయ్యిందని నాగార్జున వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ సీజన్ 7కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనని తెగేసి చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 6 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కొందరిని ఎలిమినేట్ చేసినపుడు నాగార్జున గురించి సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్ల్స్ చేసారు ముఖ్యంగా ఇనాయ ఎలిమినేట్ విషయం లో యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా నాగార్జున మీద కోపాన్ని చూపించారు దింతో హర్ట్ అయిన నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది.

బెస్ట్ హోస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకుంటే ఆ షో కి ఉన్న క్రేజ్ చాలా వరకు తగ్గుతుందని కొందరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.నాగార్జున బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతే అయన ప్లేస్ లో రానా ని ( Rana ) తీసుకువచ్చే ఆలోచన లో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది.రానా ఇప్పటికే నెంబర్ 1 యారి షో లో కూడా హోస్ట్ గా చేసాడు ఆ షో కూడా మంచి సక్సెస్ సాధించింది ఆల్రెడీ రానా కి హోస్ట్ గా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

కాబట్టి రానా నే బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నారు యాజమాన్యం.చూడాలి మరి నాగార్జున ప్లేస్ ని రానా ఫిల్ చేస్తారో లేదో.

Advertisement

తాజా వార్తలు