'హీరో' టైటిల్ తో గల్లా అశోక్.. టీజర్ ఇంప్రెసివ్..!

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో గల్లా అశోక్.సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ మేనల్లుడు హీరో టైటిల్ తో వస్తున్నాడు.

ఈ సినిమాను టాలెంటెడ్ డైరక్టర్ శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నారు.సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది.

సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది.ఈ టీజర్ చూస్తే కౌ బోయ్ వేషంలో గల్లా అశోక్ సర్ ప్రైజ్ చేశాడు.

ఇక టీజర్ చూస్తే మహేష్ టక్కరిదొంగ సినిమా గుర్తుకొస్తుంది.సినిమాలో హీరో అశోక్ లుక్ బాగుంది.

Advertisement

టీజర్ కూడా షార్ట్ అండ్ స్వీట్ గా ఇంప్రెస్ చేసింది.ఇక నిధి అగర్వాల్ అందాలు సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి.

ఈ సినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ జుంబారే సాంగ్ ను రీమిక్స్ చేశారు.మొదటి సినిమానే హీరో టైటిల్ తో హీరోగా తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు గల్లా అశోక్.

మేనమామ లాగా స్టార్ హీరో అయ్యేలా అశోక్ కృషి చేస్తాడో లేదో చూడాలి.ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.

సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా రిలీజ్ ఎప్పుడన్నది త్వరలో ప్రకటిస్తారు.మొదటి సినిమాకే లవ్, యాక్షన్ అన్ని విభాగాల్లో తన సత్తా చాటేలా ఉన్నాడు గల్లా అశోక్.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఈ ఫస్ట్ లుక్ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు