అందరికీ నమస్కారం ! నేను క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని 

పిఠాపురం నియోజకవర్గంలో( Pithapuram Constituency ) ఎన్నికల పోరు హారహోరిగా ఉంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇక్కడ నుంచి పోటీ చేస్తుండడంతో,  ఇక్కడ వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ వంగా గీతను( MP Vanga Gita ) ఎమ్మేల్యే అభ్యర్థిగా పోటీకి దించారు.

అంతే కాదు నియోజకవర్గంలో పవన్ ఓటమే లక్ష్యంగా అనేక వ్యూహాలు రచిస్తున్న వైసిపీ , కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ను వైసీపీలో చేర్చుకోవడంతో పాటు , పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగించి, పవన్ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించింది.ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేస్తున్నారు.

పవన్ కచ్చితంగా ఓడిపోతారని లేకపోతే తన పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటాను అంటూ సవాల్ చేశారు.దీనిపై ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి( Kranthi ) రియాక్ట్ అయ్యారు.

పవన్ పై తన తండ్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న విమర్శలను క్రాంతి ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం బాగా వైరల్ అయింది .తాజాగా మరోసారి ఓ వీడియోను విడుదల చేస్తూ క్రాంతి పెట్టిన పోస్ట్ మరింత వైరల్ గా మారింది.

Advertisement

" అందరికీ నమస్కారం.నేను క్రాంతి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) గారి అమ్మాయిని.పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు వైసిపి నాయకులు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు.

అందులో భాగంగా మా నాన్న ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు.పవన్ కళ్యాణ్ ను ఓడించి పిఠాపురం నుంచి తరిమేయకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు.

కానీ ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు.ముద్రగడ ప్రకటన ఆయన అభిమానులకు కూడా నచ్చలేదు.

వైసీపీ అభ్యర్థి వంగ గీత గెలుపు కోసం కష్టపడొచ్చు కానీ,  పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడడం మంచిది కాదు.ఇది కేవలం పవన్ ను తిట్టడానికే మా నాన్నని వైయస్ జగన్ వాడుతున్నారు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

ఈ ఎన్నికల తరువాత మా నాన్నను ఎటు కాకుండా వదిలేయడం పక్కా అంటూ వీడియోలో ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి పేర్కొన్నారు.

Advertisement

 క్రాంతి చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం సైతం స్పందించారు .నా కూతురుకు పెళ్లయింది.పెళ్లి కాక ముందు వరకే నా ప్రాపర్టీ , ఇప్పుడు ఆమె మెట్టినిల్లే ఆమె ప్రాపర్టీ నన్ను నా కూతురితో కొంతమంది తిట్టించారని మండిపడ్డారు.

ఇది బాధాకరం అంటూ ముద్రగడ ఆవేదన చెందారు రాజకీయం రాజకీయమే కూతురు కూతురే అని ముద్రగడ వ్యాఖ్యానించారు.నేను ఒకసారి వైఎస్సార్సీపీలో చేరాను.ఇక పక్క చూపులు చూడను ఎవరెన్ని అనుకున్నా.

సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం, నేను పదవుల కోసం పాకులాడనని ముద్రగడ వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు