బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 17 ఏళ్లకే చైనీస్ అబ్బాయి మృతి..!

ఇటీవల కాలంలో యుక్త వయసులో ఉన్న వారికే గుండెపోట్లు వస్తున్నాయి.దీనివల్ల వారు అకాల మరణం చెందుతున్నారు.

ఈ సంఘటనలు చాలామందిలో ఆందోళనలను పెంచేస్తున్నాయి.తాజాగా బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో ఇలాంటి మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

ఇండోనేషియా( Indonesia )లోని యోగ్యాకర్తాలో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల చైనా క్రీడాకారుడు ఝాంగ్ ఝజీ( Zhang Zhijie ) కోర్టులో కుప్పలిపోయి మృతి చెందాడు.జపాన్‌కు చెందిన కజుమా కవానోతో ఆయన ఆదివారం మ్యాచ్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది.

మొదటి గేమ్ 11-11 స్కోర్‌తో సమంగా ఉండగా, ఝాంగ్ ఝజీ ఒక్కసారిగా కోర్టులో పడిపోయాడు.

Advertisement

వెంటనే వైద్య సదుపాయం అందించినా, ఆస్పత్రికి తరలించినా, ప్రాణాలు దక్కలేదు.అతని మరణానికి కచ్చితమైన కారణం వెంటనే తెలియలేదు కానీ, ఆ తర్వాత అధికారులు ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలిపారు.

ఇండోనేషియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ ఆసియా ( PBSI ), 2024 జూనియర్ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులు కలిసి జారీ చేసినఓ ప్రకటనలో జాంగ్ మరణం పట్ల తమ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.టోర్నమెంట్ డాక్టర్, వైద్య బృందం వెంటనే చికిత్స అందించినప్పటికీ, ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆదివారం రాత్రి 11:20 గంటలకు జాంగ్ మరణించారని తెలిపారు.ఈ వార్త తెలిసి బ్యాడ్మింటన్ రంగం నుంచి నివాళులు వెల్లువెత్తాయి.

భారత స్టార్ ప్లేయర్ పి.వి.సింధు( PV Sindhu ) కూడా హృదయ విదారకమైన సందేశాన్ని పంపించారు.ఆమె ఝాంగ్ కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తూ, ఈ క్రీడలో అసాధారణ ప్రతిభను కలిగి ఉన్న ఒక క్రీడాకారుడు కోల్పోవడం పట్ల దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు