ఆరోగ్యానికి వరం కర్బూజ గింజలు.. రోజూ తింటే లాభాలే లాభాలు!

కర్బూజ పండ్ల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.ముఖ్యంగా వేసవి కాలంలో కర్బూజ పండ్లు( Muskmelon ) విరివిగా లభ్యమవుతూ ఉంటాయి.

శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే కర్బూజ పండ్లలో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ నిండి ఉంటాయి.అందువల్ల ఆరోగ్యానికి కర్బూజ పండ్లు ఎంతో మేలు చేస్తాయి.

అయితే కర్బూజ పండ్లే కాదు అందులో ఉండే గింజలు కూడా మన ఆరోగ్యానికి వరమ‌నే చెప్పుకోవచ్చు.మార్కెట్లో కర్బూజ గింజలు( Muskmelon Seeds ) మనకు దొరుకుతుంటాయి .వాటిని తెచ్చుకుని రోజు తింటే బోలెడు ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.క‌ర్బూజ గింజ‌ల్లో ఒమేగా-3 మరియు ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.ఆరోగ్యకరమైన రక్తపోటును ప్రోత్సహిస్తాయి మరియు హృదయ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

Advertisement
Health Benefits Of Eating Muskmelon Seeds Details, Muskmelon Seeds, Muskmelon S

కర్బూజ గింజ‌ల్లో ఉండే విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ కంటి చూపును( Eyesight ) పదును పెట్టడంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

Health Benefits Of Eating Muskmelon Seeds Details, Muskmelon Seeds, Muskmelon S

విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండ‌టం వ‌ల్ల క‌ర్బూజ గింజ‌లు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను( Immunity Power ) బలోపేతం చేస్తాయి.ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని త‌గ్గిస్తాయి.అలాగే క‌ర్బూజ గింల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియ ప‌నితీరును పెంచుతుంది.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.క‌ర్బూజ గింజ‌ల్లో ఉండే విట‌మిన్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.

స్కిన్ ఏజింగ్ ను ఆల‌స్యం చేస్తాయి.చ‌ర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

Health Benefits Of Eating Muskmelon Seeds Details, Muskmelon Seeds, Muskmelon S
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

క‌ర్బూజ గింజ‌ల్లో ప్రోటీన్ కూడా మంచి మొత్తంలో ఉంటుంది.అందువ‌ల్ల వీటిని రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకుంటే శరీర కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి.మరియు మీ జుట్టు, గోళ్ల పెరుగుదలను కూడా ప్రోత్స‌హిస్తాయి.

Advertisement

అంతేకాకుండా క‌ర్బూజ గింజ‌ల్లో పొటాషియం ఉంటుంది.అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్న వారు నిత్యం రెండు టేబుల్ స్పూన్లు క‌ర్బూజ గింజ‌ల‌ను తింటే చాలా మంచిది.

త‌ద్వారా ర‌క్త‌పోటు అదుపులోకి వ‌స్తుంది.

తాజా వార్తలు