సాధారణంగా ఒక్కోసారి జుట్టు చాలా పొడి పొడిగా మారిపోయి కళతప్పి కనిపిస్తుంటుంది.అటువంటి జుట్టును రిపేర్ చేసుకునేందుకు చాలా మంది సెలూన్ కు పరుగులు పెడుతుంటారు.
అక్కడ వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా పొడి జుట్టును( Dry Hair ) స్మూత్ గా మరియు సిల్కీగా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్( Boiled Rice ) వేసుకోవాలి.అలాగే ఒక చిన్న కప్పు కొబ్బరి పాలు,( Coconut Milk ) వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు రెండు మందారం పూలు వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్( Aloevera Gel ) వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం గాఢత తక్కువ ఉన్న షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల ఒక్క దెబ్బతోనే మీరు మంచి రిజల్ట్ ను పొందుతారు.
ఈ మాస్క్ డ్రై హెయిర్ ను రిపేర్ చేస్తుంది.జుట్టును సహజంగానే స్మూత్ గా మరియు సిల్కీగా మారుస్తుంది.షైనీ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

అలాగే వారానికి ఒకసారి ఈ మాస్క్ ను వేసుకుంటే కనుక హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.
మరియు జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.