చాలా మంది ఇష్టంగా తినే పండ్లలో డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit ) ఒకటి.ఖరీదు కాస్త ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గ పోషకాలు డ్రాగన్ ఫ్రూట్ లో ఉంటాయి.
డ్రాగన్ ఫ్రూట్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల బోలెడు హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.అలాగే అందాన్ని రెట్టింపు చేసే సత్తా కూడా డ్రాగన్ ఫ్రూట్ కు ఉంది.
ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మొటిమలు లేని తెల్లటి మెరిసే చర్మం మీ సొంతం అవ్వడం ఖాయం.
టిప్ -1:
ముందుగా మిక్సీ జార్ లో కొన్ని డ్రాగన్ పండు ముక్కలు వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు డ్రాగన్ ఫ్రూట్ ప్యూరీ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు పాలు,( Milk ) వన్ టేబుల్ స్పూన్ శనగ పిండి,( Besan Flour ) వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.స్కిన్ హెల్తీగా గ్లోయింగ్ గా మారుతుంది.
స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
టిప్ 2:
ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు డ్రాగన్ ఫ్రూట్ ప్యూరీ వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి,( Cinnamon Powder ) పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమలు మచ్చలు పరారవుతాయి.క్లియర్ స్కిన్ ను పొందుతారు.చర్మం తెల్లగా మారుతుంది.ముడతలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.
స్కిన్ టైట్ అవుతుంది.మరియు షైనీ గా కూడా మెరుస్తుంది.