ఖాళీ గ్యాస్ సిలిండర్ బరువు చూసి షాక్ అయ్యాడు.. తెరిచి చూసి షేక్ అయ్యాడు?

కరోనా తరువాత దేశంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సగటు మధ్యతరగతి వాడు బతకలేని పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలో వంట గ్యాస్ ధరలు ఏవిధంగా బాధిస్తున్నాయా వేరే చెప్పాల్సిన పనిలేదు.ఒక వైపు కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.

మరోవైపు ములిగే నక్కపై తాటిపండు పడ్డట్టు సిలిండర్ బండలో నీళ్లు నింపి కొన్ని ఏజెన్సీలు సామాన్య జనాన్ని దారుణంగా మోసం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే, నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రానికి చెందిన ఏలే సలేశ్వరం.

గత కొన్ని రోజుల క్రితం "కల్వకుర్తి శ్రీలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ" వద్ద చారకొండలో రూట్ బాయ్ వద్ద సిలిండర్ తీసుకున్నాడు.ఈరోజు అతని ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో సిలిండర్ తీసి చూడగా ఖాళీ సిలిండర్ చాలా బరువుగా ఉండటాన్ని గమనించాడు.వెంటనే తూకం చేసి చూడగా.7 కిలోల అధిక బరువు ఉన్నట్టు అర్ధం అయింది.కాగా ఈ తంతుని ఇరుగుపొరుగువారికి చూపించడంతో వారు అవాక్కయ్యారు.

Advertisement

తరువాత ఏదో ఆలోచన వచ్చినవాడిలా ఓ స్కృడైవర్ తీసుకున్నాడు.దాంతో సిలిండర్ పిన్నును ఒత్తిచూడగా అందులో నుంచి నీళ్ళు వాదరలాగా బయటికి రావడం చూసి అక్కడ వున్నవారు సైతం అవాక్కయ్యారు.దాంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

స్థానికులు మాట్లాడుతూ."ప్రస్తుతం మేము గడ్డు పరిస్థితులను చూస్తున్నాం.

ఇది చాలదన్నట్టు మమ్మల్ని ఇంకా దోచేస్తున్నారు.చెప్పండి.

మేము ఇకనుండి వంట గ్యాస్ బుక్ చేసుకుపోవాలా.వద్దా? మాకు న్యాయం జరిగిలే చూడండి!" అని స్థానిక మీడియా వేదిక ద్వారా తమ గోడిని వెళ్లబుచ్చుకున్నారు.

సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??
Advertisement

తాజా వార్తలు