మీరెప్పుడైనా మూడు కండ్లు ఉన్న దూడ‌ను చూశారా..

ఈ ప్ర‌పంచంలో అనేక వింత‌లు, విశేషాలు జ‌రుగుతుంటాయి.ఇలాంటి వింత‌ల‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతుంటాయి.

ఇక జంతువుల‌కు సంబంధించినంత వ‌ర‌కు వాటి పుట్టుక‌కు సంబంధించిన వార్త‌లు బాగా హ‌ల్ చ‌ల్ చేస్తుంటాయి.అవి సాధార‌ణంగా ఉండాల్సిన రూపంలో కాకుండా.

ఇత‌ర రూపాల్లో జ‌న్మించిన‌ప్పుడు ఇందుకు సంబంధించిన వార్త‌లు బాగా పాపుల‌ర్ అవుతుంటాయి.మొన్న‌టికి మొన్న ఓ ఊరిలో రెండు త‌ల‌ల‌తో మేక పుట్టిన గ‌ట‌న ఎంత‌లా పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అయితే మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఈ సృష్టిలో ఏ జంతువుకు అయినా రెండు కండ్లే ఉంటాయి క‌దా.మ‌న‌కు త్రినేత్రుడు అన‌గానే ముందుగా శంక‌రుడు మాత్ర‌మే గుర్తుకు వ‌స్తాడు.

Advertisement

ఎందుకంటే ఈ సృష్టిలో ఆయ‌న‌కు మాత్ర‌మే ఇలా మూడు కండ్లు ఉంటాయి.కానీ ఇప్పుడు ఓ దూడ ఇలా మూడు కండ్లతో జ‌న్మించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఎందుకంటే దూడ‌లు ఎప్పుడైనా రెండు కండ్లు లేదంటే రెండు కాళ్ల‌తో జ‌న్మించిన ఘ‌ట‌న‌లు చూశాం.కానీ ఇలా మూడు కండ్ల‌తో జ‌న్మించ‌డం ఎప్పుడూ చూడ‌లేదు క‌దా అందుకే ఇలా అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నందగావ్ జిల్లాలో జ‌రిగిన ఈ వింత ఘ‌ట‌న అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.ఈ జిల్లాలో ఉండే ఓ రైతుకు చెందిన గేదె ఓ దూడ‌కు జ‌న్మ‌నిచ్చింది.అయితే ఈ దూడ మూడు కండ్లు, ముక్కులో నాలుగు రంద్రాలు క‌లిగి ఉండ‌టం విశేషం.

అయితే సంక్రాంతి రోజుల‌న త‌న‌కు ఈ దూడ పుట్ట‌డం ఆనందంగా ఉందంటూ ఆ రైతు వెల్ల‌డించారు.అయితే ఈ వార్త చుట్టు ప‌క్క‌ల ఊర్ల వారికి తెలిసి వారంతా చూసేందుకు త‌ర‌లి వ‌స్తున్నారు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వైరల్: కోతులు కొట్లాటకు ఆగిపోయిన రైళ్లు!

ఈ దూడ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్క‌ర్లు కొడుతున్నాయి.మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి..

Advertisement

తాజా వార్తలు