మీ ఫేస్‌బుక్‌ అకౌంట్ చెక్ చేసుకున్నారా? వేల సంఖ్యలో లాక్ అయిపోతున్న అకౌంట్స్!

అవును, మీరు వింటున్నది నిజమే.ఆ లిస్టులో మీరు వున్నారో లేదో చెక్ చేసుకోండి.

ఏమైందో ఏమో తెలియదు గాని, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన యూజర్లకు షాక్ ఇచ్చింది.ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫేస్ బుక్ యూజర్ల అకౌంట్లను లాక్ చేసింది.

Have You Checked Your Facebook Account Thousands Of Locked Accounts!, Facebook,

అయితే ఈ అకౌంట్లను ఎందుకు లాక్ చేయాల్సి వచ్చిందో మాత్రం ఇంకా వెల్లడించలేదు.ఆ కారణంగా ఫేస్ బుక్ అకౌంట్లను లాక్ చేయడంపై యూజర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఉన్నట్టుండి సడెన్ గా "మీ Facebook అకౌంట్ మా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా రన్ అవుతోంది.కాబట్టి మీ అకౌంట్ ను నిలిపివేస్తున్నాం.

Advertisement

అలాగే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేం!" అంటూ ఓ మెసేజ్ పంపుతుంది.ఇకపోతే సదరు అకౌంట్లను లాక్ చేయడానికి ముందు Meta కంపెనీ ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు.

అలాగే లాక్ చేయడానికి సరియైన కారణాన్ని మెటా యాజమాన్యం తెలపడం లేదు.అందువలన దీనిపై FB యూజర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

ఈ క్రమంలో మెటా కంపెనీ ప్రతినిధి మెటా ఆండీ స్టోన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.కొంతమంది యూజర్లకు తమ Facebook అకౌంట్లను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిసినది.

వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం.అని చెప్పడం గమనార్హం.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
మా ఇంట్లో వారే అలాంటి  పక్షపాతం చూపేవారు... ఎమోషనల్ అయిన విష్ణు ప్రియ!

ఇకపోతే ఇప్పటివరకూ ఎంతమంది ఫేస్ బుక్ యూజర్లు ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో తమకు తెలియదన్నారు ఆండీ.అయితే ఓ FB యూజర్ అయినటువంటి PR కన్సల్టెంట్ జెన్ రాబర్ట్స్ తన FB అకౌంట్ లాక్ అయినట్టు ముందుగా గుర్తించారు.

Advertisement

ఈ సందర్భంగా ఆమె మీడియాతో ఇలా మాట్లాడింది.తాను గత కొన్నాళ్లుగా నా FB అకౌంట్ యూస్ చేయలేదు.

తాను ఎంతో ఇష్టంగా దాచుకున్న ఒకప్పటి స్కూల్, కాలేజీకి సంబంధించిన ఫొటోలు, కుటుంబ సభ్యుల ఫొటోలు వంటి పర్సనల్ వివరాలు అకౌంట్లో ఉన్నాయని, వాటిని తిరిగి పొందలేనేమోనని బాధను ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.

తాజా వార్తలు