ఈ స్టార్ డైరెక్టర్లందరి సినిమాలకు కాలం చెల్లిందా..?ఇక వీళ్ళు షెడ్డుకి వెళ్లాల్సిందేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే కొంతమంది కమర్షియల్ డైరెక్టర్లు మాత్రం ఇంకా కామెడీ సినిమాలను చేస్తూ పరువును తీస్తున్నారని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పటికే పూరి జగన్నాధ్, హరీష్ శంకర్( Harish Shankar , Puri Jagannadh ) ఒకప్పుడు కమర్షియల్ డైరెక్టర్లు గా మంచి గుర్తింపు పొందారు.

కానీ ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పడిపోయేలా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ పరువు తగ్గిస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక వీళ్లతో పాటు రోటీన్ సినిమాలను చేసే డైరెక్టర్లలో అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీ( Gopichand Malineni , Bobby ) లాంటి దర్శకులు కూడా రొటీన్ సీన్లతో కమర్షియల్ సినిమాలు చేసి కలెక్షన్లను అయితే సాధిస్తున్నారు.కానీ సినిమాలు ప్రేక్షకుల మనసును మాత్రం తాకడం లేదు.మనవాళ్లు బాహుబలి, కల్కి లాంటి గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటే వీళ్ళు మాత్రం ఇంకా ఒక పది సంవత్సరాల కిందట ఎలాంటి కథలైతే ఇండస్ట్రీలోకి వచ్చేవో అలాంటి కథలతో సినిమాలు చేసి సక్సెస్ లను అందుకోవాలను కుంటున్నారు.

నిజానికి అలాంటి కథలకు ఎప్పుడో కాలం చెల్లింది.మరి ఇంకా వీళ్ళు ఎందుకు అలాంటి ఒక రొటీన్ ఫార్మాట్ లోనే ముందుకు వెళ్తున్నారు.కొంచెం పంథా మార్చి మంచి కథలను చేయొచ్చు కదా అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Advertisement

ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో కమర్షియల్ కథలకు కాలం చెల్లిందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇకమీదటైనా వీళ్లు మంచి కథలను ఎంచుకొని మంచి సినిమాలు చూస్తే బాగుంటుంది.

లేకపోతే తొందర్లోనే వీళ్ళందరూ షెడ్డుకి వెళ్లిపోవాల్సిందే.చూడాలి మరి వీళ్ళ తర్వాత సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది.

Advertisement

తాజా వార్తలు