తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్ట్17, శనివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.01

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 17 Saturday 2024, A-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.42

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.5.20 ల6.20

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు బంధు మిత్రులతో ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది.దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

మిథునం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు.సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు.

కర్కాటకం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు.వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.

సింహం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

కన్య:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు.

తుల:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.దైవ అనుగ్రహం తో వ్యాపారాలు లాభాల బాట పడతాయి.ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

వృశ్చికం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది.ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి.దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.

ధనుస్సు:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది.సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.దూర ప్రయాణం సూచనలు ఉన్నవి.వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.

మకరం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.

ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు.వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కుంభం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.దైవదర్శనాలు చేసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Saturday, Astrologer, Astrology, August Saturday, Horoscope, Panchangam,

ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది.ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు.ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube