సీఎంఆర్ లక్ష్యం సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలి రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్రాజన్న సిరిసిల్ల జిల్లా : సీఎంఆర్ లక్ష్యం సెప్టెంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.2023-24 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ రా రైస్ లక్ష్యంపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో అదనపు కలెక్టర్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.2023-24 ఖరీఫ్ సీజన్ 1,34,861 క్వింటాళ్ల రా రైస్ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటిదాకా 63,742 క్వింటాళ్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ సీ ఐ) సివిల్ సప్లై శాఖలకు అప్పగించడం జరిగిందని వెల్లడించారు.జిల్లాలోని రైస్ మిల్లర్లందరూ వారికి కేటాయించిన ధాన్యాన్ని వచ్చేనెల 30వ తేదీలోగా ఎఫ్ సీ ఐ, సివిల్ సప్లై కి సీఎంఆర్ రైసు రా రైస్ అందజేయాలని ఆదేశించారు.ఎట్టి పరిస్థితుల్లో గడువు పెంచరని స్పష్టం చేశారు.
అనంతరం జిల్లాలోని మిల్లుల వారిగా ఇచ్చిన లక్ష్యం వారు పూర్తి చేసిన ఉత్పత్తి వివరాలు వెల్లడించారు.ఇప్పటివరకు రా రైస్ ఇవ్వడంలో వెనుకబడిన మిల్లులను గుర్తించి వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని, ఆయా మిల్లులను నిత్యం తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు.
సీఎంఆర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైస్ మిల్లర్లు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జిల్లాలోని రా రైస్ మిల్ యజమానులందరూ సమన్వయంతో ప్రభుత్వం అందించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని వివరించారు.గన్ని బ్యాగులు సమస్యను పరిష్కరించాలని రైస్ మిల్లుల యజమానులు అదనపు కలెక్టర్ ను కోరారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, డీటీలు తదితరులు పాల్గొన్నారు
.