ప్రాధాన్యం తగ్గిందా ? ఈటెల అయోమయంలో పడ్డారా ?

బిజెపి నేత, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajendar ) రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది.

బీఆర్ఎస్ లో కీలక నేతగా గుర్తింపు పొందిన రాజేందర్ ను కెసిఆర్ దూరం పెడుతూ రావడం,  మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయడం తదితర పరిణామాలతో ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.

బీజేపీ నుంచి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.ఇక అప్పటి నుంచి రాజేందర్ కు బిజెపిలో ఎక్కువగానే లభించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బిజెపి అగ్ర నేతలు అంతా రాజేందర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.బీసీ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని వినిపించారు.

దీంతో రాజేందర్ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరిగింది.కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్ ఓటమి చెందారు.

Advertisement

ఇక అప్పటి నుంచి రాజేందర్ అసంతృప్తితో నే ఉంటున్నారని , దీనికి తగ్గట్లుగానే బిజెపి( BJP ) అధిష్టానం పెద్దలు కూడా రాజేందర్ కు ప్రాధాన్యం తగ్గించడం,  తదితర పరిణామాలతో గందరగోళంలో ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు పడిందనే ప్రచారం జరుగుతుంది.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ( Bandi Sanjay )కొనసాగుతున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా రాజేందర్ తో పాటు,  మరికొంతమంది సీనియర్ నాయకులు అధిష్టానం పెద్దలతో మంతనాలు చేయడం,  ఆ తర్వాత బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వంటివి జరిగాయి.ఈ వ్యవహారంలో రాజేందర్ కీలకపాత్ర పోషించినట్లుగా ప్రచారం జరిగింది.అయితే 11 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి తమ అభ్యర్థులను పోటీకి దించినా కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించడం తో,  అనవసరంగా బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి రాజేందర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామా అనే బాధ బీజేపీ పెద్దల్లో కనిపించిందట.

దీంతో మళ్లీ బండి సంజయ్ కు బిజెపి అధ్యక్ష పదవి అప్పగిస్తే మంచిదనే ఆలోచన కూడా వచ్చారు.

 ఇదిలా ఉంటే రాజేందర్ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు.మెదక్ నుంచి మొదటగా పోటీ చేస్తానని రాజేందర్ ప్రకటించారు .కానీ కెసిఆర్ కూడా మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేసే ఆలోచనతో ఉండడంతో,  మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని రాజేంద్ర భావిస్తున్నారట.  ఇక్కడ నుంచి సీనియర్ నేత మురళీధర్ రావు కూడా టికెట్ ఆశిస్తూ ఉండడంతో,  ఎవరికి బీజేపీ అధిష్టానం ఈ సీటు కేటాయిస్తుందో తేలాల్సి ఉంది.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్ పార్టీ మాత్రం  పార్టీ మారే ఆలోచనలు ఉన్నారనే ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు