హరీష్ శంకర్ పరిస్థితి దారుణంగా తయారైంది... దీనికి కారణం ఎవరు..?

ప్రస్తుతం హరీష్ శంకర్( Harish Shankar ) సినిమా షూట్ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు.

ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎపి ఎలక్షన్స్ ఉండటం తో ఆ సినిమా షూట్ కి కొన్ని రోజులు బ్రేక్ పడింది.

దాంతో ఈ సినిమా షూట్ కొన్ని నెలలు పోస్ట్ పోన్ అయింది ఇక ఈ నేపథ్యంలో రవితేజ తో ఒక సినిమా చేయడానికి హరీష్ ప్లాన్ చేసినప్పటికీ అది ప్రస్తుతం వర్కౌట్ అవుతున్నట్టుగా లేదు.అందుకే మరో హీరోతో తను సినిమా చేయాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

అయితే హీరో ఎవరు అనేది మాత్రం ఇప్పటివరకు ఇంకా తెలియలేదు.నిజానికి హరీష్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఆయన స్క్రిప్ట్ కి ఎవరైతే సరిపోతారో వాళ్ళని మాత్రమే తీసుకుని హరీష్ శంకర్ సినిమా చేస్తూ ఉంటాడు.

ఇక కమర్షియల్ డైరెక్టర్( Director ) గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.అయితే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా తో హరిష్ శంకర్ భారీ సక్సెస్ అందుకోవాలని చూశాడు.కానీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా అనేది లేట్ అవుతూ వస్తుంది.

Advertisement

ఇక ఈ గ్యాప్ లో హరీష్ వేరే హీరో తో ఒక పెద్ద సక్సెస్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమాతో మంచి విజయం సాధించడమే కాకుండా పవన్ కళ్యాణ్ తో వచ్చే సినిమా తో మరొక బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు.మరి హరీష్ అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్దీ రోజులు వెయిట్ చేయాలి.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు