విశాఖ సభలో ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకోవడం మాత్రమే కాదు కొన్ని పార్టీలు పొత్తులు కూడా ఖరారు చేసుకోవడం జరిగాయి.

 Pawan Kalyan Sensational Comments On The Post Of Chief Minister , Janasena, Paw-TeluguStop.com

దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీతో జనసేన( Janasena ) కలిసి పోటీ చేయబోతోంది.ఈ క్రమంలో ఇప్పటికీ ఇరు పార్టీలకు చెందిన జాయింట్ కమిటీ ఏర్పాటు కావడం.

ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ముఖ్యమంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నంలో( Visakhapatnam ) జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే.2014లో టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.ఈ క్రమంలో 2019 ఎన్నికలలో దురదృష్టవశాత్తు కుదరలేదని.

వచ్చే ఎన్నికలలో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి నడుస్తున్నట్లు స్పష్టం చేశారు.ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ నిలబడిన ప్రతి అభ్యర్థిని గెలిపిస్తే.

మద్దతు ఇచ్చిన స్థానాలలో అభ్యర్థులను గెలిపిస్తే జనసేన బలం తెలుస్తుంది.అప్పుడు ముఖ్యమంత్రి పదవిని అడగగలం.

మీ అభిమానం ఓటుగా మారాలి.సీఎం పదవి పై నేను చంద్రబాబు కలిసి నిర్ణయం తీసుకుంటామంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube