ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా( Harish Kumar Gupta ) నియామకం అయ్యారు.ఈ మేరకు తక్షణమే విధులకు హాజరుకావాలని హరీశ్ కుమార్ గుప్తాకు ఎన్నికల సంఘం ( Election Commission ) ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం హరీశ్ కుమార్ గుప్తా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.1992 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను నూతన డీజీపీగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది.అయితే ఏపీ డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి( KV Rajendranath Reddy ) మీద ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

విపక్షాల ఫిర్యాదు మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

రాజకీయాల్లో పవన్ సక్సెస్ కావడానికి చిరంజీవి ఫెయిల్ కావడానికి అసలు కారణాలివేనా?

తాజా వార్తలు