గుర్తుందా శీతాకాలం అని పాడుకుంటున్న తమన్నా, సత్యదేవ్

కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో నాగ శేఖర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

Gurtunda Seethakalam Title For Satyadev New Movie, Tamannah, Tollywood, Naga Sek

ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నాతో కుర్ర హీరో సత్యదేవ్ జత కట్టాడు.

ఈ కాంబినేషన్ పై ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.స్టార్స్ తో చేసిన తమన్నా ఈ సినిమాలో సత్యదేవ్ లాంటి కుర్ర హీరోతో రొమాన్స్ కి రెడీ కావడం సంచలనం అయ్యింది.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకి వచ్చింది.ఈ రీమేక్ కోసం గుర్తుందా శీతాకాలం టైటిల్ కన్ఫర్మ్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తుంది.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో నటుడుగా మరోసారి సత్తా చాటిన సత్యదేవ్ ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపించడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు టైటిల్ గా గుర్తుందా శీతాకాలం టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తుంది.

ఈ టైటిల్ ఇదివరకు నితిన్ సినిమాకు అనుకున్నారు.ఛల్ మోహన్ రంగ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఇదే.త్రివిక్రం కు బాగా నచ్చిన టైటిల్ కూడా.అయితే అందరు ఛల్ మోహన్ రంగకి ఓటేయడంతో ఆ టైటిల్ పక్కన పెట్టారు.

ఇప్పుడు ఇదే టైటిల్ ను ఈ సినిమాకు వాడుతున్నారు.త్వరలో టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ని అఫీషియల్ గా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు