నెల‌స‌రి నొప్పుల‌కు చెక్ పెట్టే జామాకులు.. ఆ బెనిఫిట్స్ కూడా!

నెల‌స‌రి.ఆడ‌వారిని అత్యంత ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇదే ముందుంటుంది.

నెలసరి సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి.

దీని కార‌ణంగా కడుపు నొప్పి, న‌డుము నొప్పి, కాళ్ల నొప్పి వంటివి అధికంగా ఉంటాయి.

అందుకే నెల‌స‌రి అంటేనే ఆడ‌వారు భ‌య‌ప‌డిపోతుంటారు.ఈ క్ర‌మంలోనే ఆరోగ్యానికి మంచిది కాద‌ని తెలిసినా.

కొంద‌రు పెయిన్ కిల్ల‌ర్స్ వాడుతుంటారు.అయితే కొన్ని కొన్ని సింపుల్ చిట్కాలు పాలో అయితే సులువుగా నెల‌స‌రి నొప్పుల‌ను నివారించుకోవ‌చ్చు.

Advertisement

ముఖ్యంగా నెల‌స‌రి నొప్పిల‌ను నివారించ‌డంలో జామ ఆకులు అద్భుతంగా స‌మాయ‌ప‌డ‌తాయి.అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

జామ ఆకులే.సాధార‌ణంగా జామ పండు ఆరోగ్యానికి మంచిద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు.

కానీ, జామ ఆకుల‌తో కూడా బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.జామపండుతో సమానంగా జామ ఆకుల్లో కూడా ఎన్నో పోష‌కాలు దాగున్నాయి.

విట‌మిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలు జామ ఆకుల్లో నిండి ఉన్నాయి.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

అటు జామ ఆకుల‌తో నెల‌స‌రి నొప్పుల‌ను కూడా నివారించుకోవ‌చ్చు.కొన్ని జామ ఆకుల‌ను శుభ్రం చేసి.క్రాష్ చేసుకుని వాట‌ర్‌లో వేసి బాగా మ‌రిగించాలి.

Advertisement

ఆ త‌ర్వాత నీటిని వాడ‌గ‌ట్టుకుని గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత తేనె క‌లిపి తీసుకోవాలి.ఇలా చేస్తే నెల‌స‌రి నొప్పులు ప‌రార్ అవుతాయి.

లేదా జామ ఆకుల‌ను శుభ్రం చేసుకుని.ర‌సం తీసుకుని సేవించినా నెల‌స‌రి నొప్పుల నుంచి మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇక జామాకుల‌తో మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.ప్ర‌తి రోజు జామాకులు టీ లేదా డైరెక్ట్‌గా జామాకుల‌ను న‌మిలి తింటే.

వెయిట్ లాస్ అవ్వొచ్చు.అలాగే జామాకులు తీసుకోవ‌డం వ‌ల్ల ఆరెంజ్ కంటే ఎక్కువ‌గా విట‌మిన్ సి ల‌భిస్తుంది.

ఫ‌లితంగా.వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ బ‌ల‌ప‌డుతుంది.

జామాకులు రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగుప‌డుతుంది.

తాజా వార్తలు