ట్యాన్‌ను సుల‌భంగా పోగొట్టే జామాకులు..ఎలా వాడాలంటే?

ట్యాన్‌స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామ‌న్‌గా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఇదీ ఒక‌టి.

సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు వ‌ల్ల స్కిన్ ట్యానింగ్ కి గురై కాంతిహీనంగా క‌నిపిస్తుంది.

ఎంత‌ ఖ‌రీదైన‌ సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించినప్పటికీ.చ‌ర్మం ట్యాన్ అయిపోతుంటుంది.

దాంతో ఏం చేయాలో తెలియ‌క‌, ట్యానింగ్‌కు గురైన చ‌ర్మాన్ని ఎలా మెరిపించుకోవాలో అర్థంగాక తెగ మ‌ద‌న ప‌డిపోతూ ఉంటాయి.అయితే ట్యాన్ స‌మ‌స్య‌ను నివారించ‌డంలో జామ ఆకులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి జామ ఆకుల‌ను చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు, మూడు జామ ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి.

Advertisement
Guava Leaves Help To Get Rid Of Sun Tan Naturally! Guava Leaves, Sun Tan, Tan, L

అందులో ఒక ఎగ్ వైట్‌ను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.అప్పుడు ర‌బ్ చేసుకుంటూ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే ట్యాన్ అయిన చ‌ర్మం తెల్ల‌గా, కాంతివంతంగా మారుతుంది.

Guava Leaves Help To Get Rid Of Sun Tan Naturally Guava Leaves, Sun Tan, Tan, L

అలాగే ఎండిన జామాకుల పొడి తీసుకుని.అందులో కొద్దిగా పెరుగు మ‌రియు ట‌మాటా ర‌సం వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి స్క్ర‌బ్ చేసుకోవాలి.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

అపై కాస్త ఆర‌నిచ్చి.అప్పుడు చ‌ల్ల‌టి నీటితో చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా ట్యాన్ స‌మ‌స్య దూరం అవుతుంది.ఇక గిన్నెలో రెండు స్పూన్ల జామాకుల పేస్ట్‌, ఒక స్పూన్ శెన‌గ‌పిండి మ‌రిచు చిటికెడు ప‌సుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

అపై ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి ప‌ట్టించి.కాస్త డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు