బర్రెలక్క కు పెరుగుతున్న మద్దతు? చరిత్ర సృష్టిస్తుందా ?

ఈరోజుల్లో ఇన్స్టా రీల్స్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు రాజకీయాల వైపు చూసిన దాఖలాలు మాత్రం లేవు.

కానీ బర్రెలక్క పేరు తో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన కర్ణే శిరీష ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గా( Kollapur Assembly constituency )నికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీపడుతుంది.

మొదట్లో ఆమె పోటీని అందరూ లైట్ తీసుకున్నా ఆమె పై దాడి జరిగిన తర్వాత క్రమంగా ఆమె కు మద్దతు ఇచ్చే ప్రజానీకం పెరుగుతున్నారు.సోషల్ మీడియా( Social media )లో ఆమెకు గెలుపు కోసం ఓ రేంజ్ ప్రచారం నడుస్తుంది ముఖ్యంగా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా, ఆర్థిక అండదండలు లేకపోయినా తాను గెలిస్తే మంచి చేస్తానంటూ మేనిఫెస్టో ను కూడా రిలీజ్ చేసిన కర్నే శిరీష ధైర్యం చాలామందిని ఆకట్టుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

దాడి జరిగిన తర్వాత కూడా ఒకవైపు రోధిస్తూనే మరోవైపు భారత ప్రజాస్వామ్య విలువలను ఆమె నిలదీసిన తీరు ఆమె కు చాలామంది మద్దత్తు గా నిలబడటానికి కారణం గా తెలుస్తుంది.

దాంతో ఇప్పుడు వారసత్వ రాజకీయాలకు అతీతంగా ప్రధాన పార్టీ బీఫార్మ్ ల కోసం ఎదురు చూడకుండా రాజకీయ చైతన్యo తో ముందుకి వచ్చిన శిరీష( Karne Sirisha ) లాంటి వారు గెలవాల్సిన అవసరం ఉందంటూ పలువురు ఆమెకు సోషల్ మీడియాలో మద్దతు పలుకుతున్నారు.అదేవిధంగా మరి కొంతమంది కొల్లాపూర్ నియోజక వర్గం లో ఆమెకు మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది .

Advertisement

ఇప్పుడు ఇక్కద చూసినా సోషల్ మీడియా లో ఆమె గురించే చర్చ జరుగుతుంది .ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో ఆమె గెలుపు ఒక కొత్త తరహా రాజకీయాలకు నాంది పలుకుతుందని , డబ్బు వారసత్వం లేకపోయినా బలమైన పట్టుదల ఉంటే సరిపోతుంది అన్న మనో ధైర్యాన్ని ఇస్తుందని అందువల్ల ఆమె గెలుపు రాజకీయాలకు ఒక మేలి మలుపు అని కూడా కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.మరికొంత మంది ఆమెకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది .

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు