పార్లమెంట్ ఎన్నికల వేళ భువనగిరి బీజేపీలో గ్రూప్ వార్..!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భువనగిరి బీజేపీలో( Bhuvanagiri BJP ) గ్రూప్ వార్ నెలకొంది.

నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్( Boora Narsaiah Goud ) వైఖరిపై పార్టీ సీనియర్లు కినుక వహించారని తెలుస్తోంది.

బూర నర్సయ్య గౌడ్ కుల రాజకీయాలు చేస్తున్నారని పార్టీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా బీఆర్ఎస్ కు కోవర్టుగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Group War In Bhuvanagiri BJP During Parliamentary Elections Details, Boora Narsa

ఈ క్రమంలోనే సీనియర్ నేతలు గూడూరు నారాయణ రెడ్డి,( Gudur Narayana Reddy ) శ్యామ్ సుందర్( Shyam Sundar ) ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని సమాచారం.నియోజకవర్గంలో నెలకొన్న గ్రూప్ వార్ తో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది.

అయితే మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బూర నర్సయ్య గౌడ్ వ్యవహారం పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.

Advertisement
మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?

తాజా వార్తలు