అసలైన లబ్ధిదారులకు అందని ద్రాక్షల ప్రభుత్వ పథకాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకే పథకాలు అందాయని సామాన్య ప్రజలకు అందలేవని రాజన్న సిరిసిల్ల జిల్లా దిశా కమిటీ సభ్యులు బట్టు పీర్యా అన్నారు.

ఈ సందర్భంగా వీర్నపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల సాక్షిగా, గత పది సంవత్సరాలుగా రెండుసార్లు తెలంగాణ ప్రజల మద్దతుతో గెలిచి బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలలో అతి ముఖ్యమైన హామీలైన దళితులకు మూడు ఎకరాల భూమి , దళిత సీఎం ప్రతి, దళిత కుటుంబానికి దళిత బందు, అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్, దళితులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు, దానితో పాటుగా గృహలక్ష్మి పథకాలకు సంబంధించి ఇప్పటివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ,సిరిసిల్ల నియోజకవర్గాలకు చెందిన దళిత సోదర కుటుంబాలకు అతి ముఖ్యమైన లబ్ధిదారులకు ఈ పథకాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆరోపించారు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఈ విషయాల్లో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ఈ రాష్ట్ర ప్రభుత్వము సంచలనాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించి లబ్ధి పొందే విషయంలో కేవలం తమ బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలుకుబడి కలిగిన బిఆర్ఎస్ కార్యకర్తలకు ఈ పథకాల ద్వారా 100% లబ్ది చేకూరిందని అన్నారు.కేవలం ఈ పథకాల ద్వారా దళిత సామాజిక వర్గానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలే లబ్ధి పొందారు కానీ , సామాన్య దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలకు బిఆర్ఎస్ ద్వారా కేవలం జీరో పర్సెంట్ లబ్ధి కూడా జరగలేదని అన్నారు.

కావున రాబోయే రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని నియోజకవర్గలైన వేములవాడ , సిరిసిల్ల నియోజకవర్గాల్లో దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజల సహాయ సహకారాలతో వారి అండదండలతో భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం పై తిరుగుబాటును జరిపి రాబోయే ఎన్నికల్లో వారి యొక్క అమూల్యమైన ఓట్ల ద్వారా బిఆర్ఎస్ కి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతామని ఈ రెండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నూటికి నూరు శాతం విజయం సాధిస్తుందని ఆశా బావ వ్యక్తం చేశారు.అదేవిధంగా దళిత సోదరుల యొక్క అన్ని రకాల సమస్యల విషయంలో వారితో కలిసిమెలిసి వారికి న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రభుత్వంతో పోరాటం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని , తెలంగాణ రాష్ట్రంలోని బహుజనుల హక్కుల కోసం బిజెపి పార్టీ వారి వెన్నంటూ ఉండి పోరాడుతుందని కేవలం గెలుపే లక్ష్యంగా రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్తామని తద్వారా దళిత సోదరుల యొక్క ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో బట్టు పీర్య తెలిపారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News