ఎఫ్3లో మ్యాచో స్టార్.. నిజమేనా?

టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్‌తో ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.కాగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.

వారిద్దరి కాంబో ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవడంతో ఈసారి ఎఫ్3లో ఇంకెలాంటి హైలైట్‌లు ఉండబోతున్నాయా అని అందరూ ఆలోచిస్తున్నారు.కాగా ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరో నటించబోతున్నట్లు గతకొద్ది రోజులుగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో మాస్ రాజా రవితేజ నటిస్తాడని గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ఈ సినిమాలో మరో హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

మ్యాచో స్టార్ గోపీచంద్ ఈ సినిమాలో ఓ కేమియో రోల్‌లో నటిస్తాడని తెలుస్తోంది.ఇటీవల సీటీమార్ చిత్ర సెట్స్‌లో గోపీచంద్‌ను కలిసి ఈ మేరకు చర్చలు జరిపాడట దర్శకుడు అనిల్ రావిపూడి.

దీంతో ఈ సినిమాలో నటించేందుకు గోపీచంద్ కూడా వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం వరుస ఫెయిల్యూ్ర్స్‌తో ఫేడవుట్ అవుతున్న గోపీచంద్ సీటీమార్ చిత్రంతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమాతో నిజంగానే గోపీచంద్ హిట్ కొడతాడో లేడో చూడాలి.

కాగా ఎఫ్3 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రీసెంట్‌గా వెంకటేష్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది.ఇక ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించి, సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు