క్యాన్సర్ చిన్నారికి సింగింగ్ ఆఫర్ ఇచ్చిన గోపీచంద్.. గొప్ప మనస్సు అంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన గోపీచంద్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు వరుసగా షాకిస్తూ గోపీచంద్ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేస్తున్నాయి.

గోపీచంద్ సినిమాలలో కొన్ని సినిమాలు మంచి కంటెంట్ తో తెరకెక్కినా సరైన సమయంలో రిలీజ్ కాకపోవడం వల్ల ఈ సినిమాలు ఆకట్టుకోలేదు.

ప్రస్తుతం గోపీచంద్ రామబాణం అనే సినిమాలో నటిస్తున్నారు.గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

అయితే అన్ స్టాపబుల్ సీజన్2 కు గెస్ట్ గా హాజరైన గోపీచంద్ ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ షోలో పాల్గొన్న క్యాన్సర్ చిన్నారికి గోపీచంద్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

తన తర్వాత సినిమాలలో పాట పాడే అద్భుతమైన అవకాశాన్ని గోపీచంద్ ఆ చిన్నారికి ఇచ్చారు.

Advertisement

గోపీచంద్ లక్ష్మీ మనోజ్ఞ అనే చిన్నారికి సహాయం చేయగా ఆ సహాయం హాట్ టాపిక్ అవుతోంది.గోపీచంద్ గ్రేట్ అని ఆయన మనస్సు మంచి మనస్సు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.లక్ష్మీ మనోజ్ఞకు బసవతారకం ఆస్పత్రిలో ఉచితంగా వైద్య చికిత్స అందేలా బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

లక్ష్మీ మనోజ్ఞ వాయిస్ అద్భుతంగా ఉండగా ఆమె స్టార్ సింగర్ అవుతారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

లక్ష్మీ మనోజ్ఞ వల్ల ఈ ఎపిసోడ్ మరింత ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ప్రభాస్, గోపీచంద్ గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయని భావించిన ప్రేక్షకులు మాత్రం ఒకింత నిరాశ చెందారు.బాలయ్య గత ఎపిసోడ్ల స్థాయిలో, అంచనాలు ఏర్పడిన స్థాయిలో ఈ ఎపిసోడ్ లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎప్పుడనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు