గూగుల్‌పేతో కేవలం 2 నిమిషాల్లోనే ఎఫ్‌డీ ఖాతాను ప్రారంభించండి!

ఇటీవల ఓ కంపెనీ కేవలం 5 నిమిషాల్లోనే తమ ఖాతాదారులకు పర్సనల్‌ లోన్లను అందించడం చూశాం.

తాజాగా చెన్నైకు చెందిన ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కేవలం రెండు నిమిషాల్లోనే అవది కూడా ఇంటి నుంచే మీ గూగుల్‌ పే ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీంను అందిస్తోంది.

ఆ వివరాలు తెలుసుకుందాం.దిగ్గజ సెర్చ్‌ ఇంజిన్‌ ఈక్విటాస్‌ బ్యాంక్‌తో జత కట్టి తమ కస్టమర్లకు మరింత ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ నేపథ్యంలోనే జీపే యూపీఐ ద్వారా ఎఫ్‌డీని ప్రారంభించడం సులభతరం చేసింది.

గూగుల్‌పే ఎఫ్‌డీకి ఈక్విటాస్‌ సేవింగ్‌ ఖాతా ఉండాల్సిందేనా?

అవసరం లేదు.ఈ బ్యాంకులో సేవింగ్‌ ఖాతా లేకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఓపెన్‌ చేయవచ్చు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ద్వారా ఎంత శాతం వడ్డీ అందిస్తోంది?

బ్యాంక్‌ వివరాల ప్రకారం వినియోగదారులు ఏడాదికి 6.35 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.కస్టమర్లు డిపాజిట్‌ మనీ, సమయంపై ఆధారపడి ఉంటుంది.

ఈక్విటాస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను కస్టమర్‌ ఎక్కడ ప్రారంభించాలి?

గూగుల్‌ పే ద్వారా ఎఫ్‌డీని ప్రారంభించాలంటే, యాప్‌లోని ‘బిజినెస్‌ అండ్‌ బిల్స్‌’ సెగ్మెంట్‌లో ఉండే ఈక్విటాస్‌ బ్యాంక్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఈక్విటాస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకానికి కేవైసీ తప్పనిసరా?

వినియోగదారులు కచ్ఛితంగా కేవైసీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.గూగుల్‌ పే యూపీఐ ద్వారా పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది.

Google Pay To Allow Users To Create Fds, Fixed Deposits, Google Pay App, Ios And
Advertisement
Google Pay To Allow Users To Create FDs, Fixed Deposits, Google Pay App, Ios And

ఎఫ్‌డీ మెచూరిటీ తర్వాత మనీ ఎలా పొందాలి?

మెచూరిటీ సమయం ముగిసిన తర్వాత బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ అయిన గూగుల్‌పే నంబర్‌కు మనీ ఆటోమెటిగ్గా జమ అవుతుంది.

వినియోగదారులు ఈ ఎఫ్‌డీ పథకాన్ని ట్రాక్‌ చేయవచ్చా?

గూగుల్‌పే యూజర్లు తమ ఎఫ్‌డీని ట్రాక్‌ చేసే అవకాశం ఉంటుంది.మరో కొత్త ఖాతాను ప్రారంభించుకోవచ్చు.

అలాగే అవసరముంటే, మెచూరిటీకి ముందే డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.

ప్రీమెచూర్‌ విత్‌డ్రాకు ఏం చేయాలి?

ఒకవేళ వినియోగదారులు డబ్బులను ముందుగానే ఉపసంహరించుకోవాలంటే, ఆ డబ్బు అదే రోజున వారి బ్యాంక్‌ ఖాతాకు చేరుకుంటుందని ఈక్విటాస్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఆండ్రాయిడ్, ఐఫోన్‌ రెండింటింకి ఈ పథకం అందుబాటులో ఉందా?

ఈక్విటాస్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.త్వరగా ఐఫోన్‌లో కూడా రానుంది.

ఇందులో డిపాజిట్‌ గ్యారంటీ ఉందా?

ఆర్‌బీఐ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులకు వర్తించే కవరేజీ వర్తిస్తుంది.అంటే డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు గ్యారంటీ ఉంటుంది.

న‌టితో ముంబై ఇండియన్స్ కెప్టెన్ డేటింగ్? వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు