గూగుల్ పే వాడుతున్నారా.. అయితే రూ200ల క్యాష్‌బ్యాక్ అందుకోండి..

ప్రస్తుతం అంతా డిజిటల్ యుగంగా మారిపోయింది.ఎక్కడ చూసినా అంతా టెక్నాలజీకి అలవాటు పడుతున్నారు.

కొత్తగా వచ్చిన మార్పులను అందిపుచ్చుకుంటున్నారు.ముఖ్యంగా ఎవరూ తమ జేబుల్లో డబ్బులు పెట్టుకుని తిరగడం లేదు.

డిజిటల్ పేమెంట్స్ యాప్‌ల ద్వారా చకచకా చెల్లింపులు చేసేస్తున్నారు.ఈ తరుణంలో దీపావళి పండుగ సందర్భంగా గూగుల్ పే తమ యూజర్లకు చక్కటి ఆఫర్ ప్రకటించింది.రూ.200ల వరకు క్యాష్ బ్యాక్ అందుకునే సౌకర్యం కల్పిస్తోంది.దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్‌లో ప్రకటించింది.

భారతదేశంలోని Google Pay యూజర్లు India-domestic chat head ఓపెన్ చేయాలి.మీరు మీ స్నేహితులతో కొన్ని ఫ్లోర్స్ నిర్మించాల్సి ఉంటుంది.

Advertisement

మీరు వేసే ప్రతి అడుగుకు మీకు రివార్డ్ అందుతుంది.మీరు చేయాల్సిందల్లా మీకు తెలిసిన వారికి చెల్లింపులు చేయడమే.

Google Payతో బిల్లులు చెల్లించడం వల్ల కూడా ఈ రివార్డు మీకు అందుతుంది.Google Pay యాప్‌లో ఇండీ హోమ్ స్క్రీన్‌పై దీపావళి మేళా కమ్యూనికేట్ చేయబడింది.టాప్ 5 లక్షల టీమ్‌లు రూ.200 వరకు గెలుస్తాయని గూగుల్ ఇండియా తెలిపింది.ఒక టీమ్‌లో మీరు, మీ స్నేహితులు ఉంటారు.

మీరు ఒంటరిగా ఆడవచ్చు.చిన్న ప్రైజ్ మనీ కూడా పొందవచ్చు.

అత్యధిక బహుమతిగా రూ.200లు క్యాష్ బ్యాక్‌ని మీరు Google Payని ఉపయోగించి చెల్లింపులు చేసినప్పుడు లభిస్తుంది.మీకు ముందుగా రూ.30 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.మీరు QR కోడ్‌ని ఉపయోగించి చెల్లించినా ఈ రూ.30 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.ఇలా మీరు ఫ్రెండ్స్ గ్రూపు ద్వారా పోటీలో పాల్గొంటే మొదటి రౌండ్‌లో మీ జట్టు రూ.50 గెలుస్తుంది.అత్యధికంగా రూ.200 బహుమతిని అందుకోవచ్చు.దీపావళి ప్రమోషన్‌లో భాగంగా మరిన్ని క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్లు గూగుల్ పే ప్రకటించింది.

వీడియో వైరల్.. సీతమ్మ మెడలో తాళి కట్టిన ఎమ్మెల్యే.. ఆగ్రహిస్తున్న ప్రజలు
Advertisement

తాజా వార్తలు