వేసవిలో శ్రీ వారి దర్శనానికి వచ్చే భక్తులకు శుభ వార్త..దర్శనం పై ఈ వో కీలక ఆదేశాలు..!

తిరుమల( Tirumala ) పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేలమంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.

సాధారణ సమయాలలో ఏమో కానీ వేసవికాలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

జూన్ 15 వరకు ఈ వేసవి రద్దీ కొనసాగుతుందని తిరుమల పుణ్యక్షేత్రం అధికారులు అంచనా వేస్తున్నారు.రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే దర్శనం, వసతి సేవ టికెట్లు పూర్తయ్యాయి.కాలినడకన వస్తున్న భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు అందిస్తున్నారు.

సేవలు ప్రారంభం అయినప్పుడు మరింతగా రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనాలతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి( TTD EO Dharama Reddy ) కీలక సూచనలను చేశారు.భక్తులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడం పై అధికారులకు సూచించారు.

Advertisement

అంతేకాకుండా తిరుమల లోని అన్నమయ్య భవనం( Annamaya )లో శనివారం టీటీడీ సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.మే1 వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు భక్తుల అవసరాలను తీర్చడానికి సంబంధిత విభాగాల అధికారులు 24 గంటలు తిరుమలలో అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.తిరుమలకు జులై 15వ తేదీ వరకు డిప్యూటేషన్ పై వచ్చే సంబంధిత అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

క్యూలైన్లు, వైకుంఠ కాంప్లెక్స్‌లు, కంపార్ట్మెంట్లలో తాగునీరు, అన్న ప్రసాదం తదితర సేవలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని సంబంధిత విభాగాధిపతులకు సూచించారు.భక్తుల రద్దీకి తగినన్ని లడ్డులు నిల్వ ఉంచాలని వెల్లడించారు.

అవసరమైన ప్రాంతాలలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు.రద్దీ ఎక్కువగా ఉండే అన్ని కీలక ప్రదేశాల్లో భక్తులకు సేవలు అందించేందుకు తగిన సంఖ్యలో శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని వెల్లడించారు.

దర్శనానికి వచ్చే భక్తులకు వెండి వాకిలి తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడంపై కూడా చర్చించారు.టీటీడీ విశ్రాంత శ్రీ టిటిడి సలహాదారు రామచంద్రారెడ్డి, రద్దీ నిర్వహణలో అపారమైన పరిజ్ఞానం, అనుభవం ఉన్న శ్రీవారి దేవాలయ విశ్రాంత డిప్యూటీ ఈ వో ప్రభాకర్ రెడ్డి కలిసి ఈ సమస్యను అధికమించేందుకు కార్యాచరణ ప్రణాళికను రెండు రోజుల్లో అందించాలని ఈవో కోరారు.

ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!
Advertisement

తాజా వార్తలు