TSPSC Telangana: నిరుద్యోగులకు శుభవార్త.. 1392లకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి నోటిఫికేషన్ లు విడుదల చేస్తూ ఉంది.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ వైద్య శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

నిన్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో 18 డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి.నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.కాగా నేడు తెలంగాణలో జూనియర్ లెక్చరర్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.1392 లెక్చరర్ ల పోస్టులకు TSPSC నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.దీనికి సంబంధించి డిసెంబర్ 16వ తారీకు నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపింది.

అంతేకాదు వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో రాత పరీక్షలు ఉండొచ్చని స్పష్టం చేసింది.తాజా నోటిఫికేషన్ లో మాథ్స్ లో 154, ఇంగ్లీష్ లో 153, జువాలజీలో 128, హిందీలో 117, కెమిస్ట్రీలో 113, ఫిజిక్స్ లో 112 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈసారి అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడే అవకాశం కనిపిస్తోంది.

Advertisement
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన

తాజా వార్తలు