ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ కీలక అప్ డేట్ ఇవ్వటం జరిగింది.వచ్చే ఏడాది జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానంద రెడ్డి తెలిపారు.₹50 రూపాయల ఫైన్ తో ఈనెల 26వ తేదీ వరకు, ₹200 రూపాయల ఫైన్ తో జనవరి 2, ₹500 రూపాయల ఫైన్ తో జనవరి 9 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు.కాగా మార్చి/ఏప్రిల్ నెలలో పరీక్షలు జరగనున్నాయి.
వాస్తవానికి ఈ పరీక్షలు ఫీజు చెల్లింపు తేదీలు ప్రారంభంలో నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 లోగా చెల్లించాలని తెలియజేశారు.ఈ పరీక్షకు సంబంధించి ఒకో విద్యార్థి ₹125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది.
ఈ క్రమంలో నిర్దేశించిన గడువులోగా ఫీజులు చెల్లించలేని విద్యార్థులు తాజాగా పైన ఫైన్ తో కలిపి అసలు ఫీజు చెల్లించే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది.