దేవుడా.. ఉపాధి కూలీలు గా మారిన మహేంద్రసింగ్ ధోని, ఆండ్రీ రసూల్..! అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ఇండియాలో ఎక్కడ చూసినా మోసాలే వెలుగు చూస్తున్నాయి.డబ్బుల కోసం ఎలాంటి మోసాలు చేయడానికైనా కొందరు మనుషులు దిగజారి మరి ప్రవర్తిస్తున్నారు.

అక్రమంగా డబ్బులు సంపాదించడానికి తెలివైన మార్గాలు ఎంచుకుంటున్నారు.కానీ ఎంత తెలివిగా డబ్బు సంపాదించిన ఏదో ఒక రోజు వారి బండారం బయట పడడం ఖాయం.

God Mahendra Singh Dhoni, Andre Rasool Who Have Become Employment Workers Tha

కామారెడ్డి జిల్లా పెదకొడప్‌గల్‌ మండలం జరిగిన ఒక భారీ మోసం కూడా ఆలస్యంగా బయటపడింది.పూర్తి వివరాలు తెలుసుకుంటే పెదకొడప్‌గల్‌ మండలం వడ్లం గ్రామంలో పొలానికి వెళ్లే దారి అధ్వానంగా మారడం తో ఆ సమస్యలను రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఒక్క అధికారి కూడా ఆ దారి బాగు చేసేందుకు ముందుకు రాలేదు.దీంతో ప్రభుత్వ అధికారులకు చెప్పినా కూడా వృధా అని భావించిన రైతులు తన సొంతంగా ఏడు లక్షల రూపాయలతో రోడ్డును బాగు చేసుకున్నారు.

Advertisement

అయితే ఈ విషయం తెలుసుకున్న ఉపాధిహామీ సిబ్బంది.ఆ రోడ్డు బాగు చేయించింది తామేనని అబద్ధం చెప్పి డబ్బులు కాజేయాలని ఒక ఉపాయం పన్నారు.

ఆ రోడ్డు నిర్మాణం కోసం 20 లక్షల 21 లక్షల రూపాయలు అయ్యాయని అడ్డగోలుగా బిల్లులను సృష్టించి ఎంచక్కా డబ్బులు డ్రా చేసుకున్నారు.తమను ఎవరు పట్టుకుంటారులే అనే పిచ్చి నమ్మకం తో ఉపాధి హామీ సిబ్బంది 21 లక్షల డబ్బులు అక్రమంగా కాజేశారు కానీ ఈ విషయం రైతుల దృష్టికి వచ్చింది.

దీంతో తాము రోడ్డు వెయ్యమని అడిగితే వేయకపోగా.తాము వేసుకున్న రోడ్డునే అడ్డు పెట్టుకుని డబ్బులు కాజేస్తారా అని రైతులు మండిపడ్డారు.

రైతులంతా కలిసి రెవెన్యూ ఆఫీస్ కి వెళ్లి తమ గ్రామంలో జరిగిన స్కాం గురించి వివరించారు.ఆర్డీవో రాజాగౌడ్‌ వెంటనే రంగంలోకి దిగి గ్రామంలో విచారించారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్

ఉపాధి హామీ కింద ఎవరెవరు పనులు చేశారో రాజాగౌడ్‌ తెలుసుకుంటుండగా ఆయనకు ధోని, ఆండ్రూ రస్సెల్ అనే ఇద్దరు క్రికెటర్ల పేర్లు కనిపించాయి.దీంతో ఒక్కసారిగా అవాక్కయిన సదరు రాజాగౌడ్‌ మరింత పరిశీలన చేసి వేలి ముద్రలు కూడా ఉపాధిహామీ సిబ్బందే పెట్టారని కనుగొన్నారు.

Advertisement

దీంతో అక్రమాలకు తెరలేపిన ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగులు అడ్డంగా బుక్కయ్యారు.అయితే ఈ స్కామ్ గురించి వివరంగా ఒక నివేదిక తయారు చేసి కలెక్టర్ కి సబ్మిట్ చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆ రైతులకు ఆర్డీవో రాజాగౌడ్‌ హామీ ఇచ్చారు.

తాజా వార్తలు