పూజ చేసిన పువ్వులు ఏ ప్రదేశంలో ఉంచకూడదో తెలుసా?

ప్రకృతిలో ఎంతో అందమైన వాటిలో పువ్వులు ముందు వరుసలో ఉంటాయి.చాలామంది పువ్వులను ఎంతో ఇష్టపడుతుంటారు.

పువ్వులు ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా వికసిస్తూ అందర్నీ ఆకట్టుకుంటాయి.తన కోసం కాకుండా ఇతరుల కోసం వికసించే పువ్వులు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.

అందుకోసమే ఆ భగవంతుడి పూజకు పుష్పాలను తప్పనిసరిగా ఉపయోగిస్తాము.ఆ దైవానుగ్రహం పొందాలంటే స్వామివారికి ఈ విధమైనటువంటి పుష్పాలతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా స్వామివారికి పూజ చేసిన పుష్పాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.అయితే భక్తులు ఈ విధమైనటువంటి పుష్పాలను పొరపాటున కూడా కొన్ని ప్రదేశాలలో పెట్టకూడదు.

Advertisement

మరి ఆ పుష్పాలను ఎక్కడ పెట్టకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఏదైనా ఆలయంలో లేదా మన పూజ గదిలో నుంచి స్వామివారికి పూజ చేసిన పుష్పాలను ప్రసాదంగా తీసుకుంటే వాటిని ఎల్లప్పుడు మనకు దగ్గరగా అంటే మన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.

ఈ విధంగా ఆలయంలో నుంచి ప్రసాదంగా ఇచ్చిన పుష్పాలు ఎల్లప్పుడు మన దగ్గర ఉంటే చెడు శక్తులు సమీపించవు.ఇవి రక్షణ కవచంగా ఉంటాయి.

ఎందుకంటే పువ్వులు పవిత్రమైనవి.

చాలామంది మహిళలు స్వామి వారి దగ్గర నుంచి ప్రసాదంగా ఇచ్చిన పుష్పాలను తలలో పెట్టుకుని కొద్దిసేపటికి వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తారు.అయితే ఇది ఎంతో పొరపాటు అని ఈ విధంగా మనం పుష్పాలను ఒక పవిత్రమైన ప్రదేశంలో, ఎవరు నడవని, తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి.ముఖ్యంగా వివాహితులు స్వామి వారి సన్నిధిలో తీసుకున్న పుష్పాలను పెట్టుకొని పొరపాటున కూడా పడకగదికి వెళ్ళకూడదని శాస్త్రం చెబుతోంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

దైవానికి ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించిన పుష్పాలను ప్రసాదంగా తీసుకున్నప్పుడు వాటిని ఎంతో పరమ పవిత్రంగా భావించాలి.అదే విధంగా ఎంతో పవిత్రమైన ప్రదేశాలలో మాత్రమే వాటిని ఉంచాలని పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు