రేపటి నుండి యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ ప్రారంభం...!

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.గిరిప్రదక్షిణ అనగానే ప్రతి భక్తునికి అరుణాచలం గుర్తుకు వస్తుంది.

2016 ఆలయ పునర్నిర్మాణానికి ముందు వరకు భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకొని తమ మొక్కులు చెల్లించేవారు.పునర్నిర్మాణంలో భాగంగా భక్తులకు అసౌకర్యలు కలుగుతున్న నేపథ్యంలో గిరి ప్రదక్షిణ నిలిపివేశారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్టపై అనేక మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు.

అదే విధంగా భక్తులు కోరిక మేరకు గిరి ప్రదక్షిణను పునఃప్రారంభించాలని నిశ్చయించారు.స్వామి వారికి ప్రీతికరమైన స్వాతి నక్షత్రమైన నేడు సుమారు 5 వేల మంది భక్తులతో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణను ప్రారంభించనున్నారు.

Advertisement

దానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో భాస్కర్ రావు సోమవారం అధికారులతో కలిసి పుర వీధుల్లో పర్యటిస్తూ పర్యవేక్షించారు.

ప్రమాదకరంగా మోతె మండల రహదారులు
Advertisement

Latest Yadadri Bhuvanagiri News